TS SSC Revaluation : పదో తరగతి ఫలితాలు మే 10న విడుదలైన విషయం తెలిసిందే. పది ఫలితాలను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే.. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులకు తెలంగాణ పదో తరగతి బోర్డు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు అవకాశం ఇచ్చింది. అయితే.. ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ.. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కానీ.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు.
జూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో అంతకంటే ముందే రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. అంటే.. మే 26 వరకే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత 15 రోజుల్లోగా అంటే మే 10 నుంచి మే 25 తేదీ లోపు తెలంగాణ పదో తరగతి బోర్డు వెబ్ సైట్ లో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం రూ.500 ఎస్బీఐ బ్యాంకులో చలాన్ చెల్లించాలి. దీన్ని బోర్డ్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తే రీకౌంటింగ్ కు అవకాశం ఉంటుంది.
TS SSC Revaluation : రీవెరిఫికేషన్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి
రీవెరిఫికేషన్ చేసుకోవాలనుకునే విద్యార్థులు https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రీవెరిఫికేషన్ అప్లికేషన్ ఎస్ఎస్సీ 2023 ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఒక్క సబ్జెక్ట్ కు వెయ్యి రూపాయలు కట్టాల్సి ఉంటుంది. వెబ్ సైట్ లో ఉండే ప్రొఫార్మాను డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని నింపి స్కూల్ హెడ్ మాస్టర్ తో అటెస్ట్ చేయించి రూ.1000 చలాన్ తీసి హెడ్ మాస్టర్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
దాన్ని హెడ్ మాస్టర్ బోర్డుకు పంపిస్తారు. అందులోనే ఏ సబ్జెక్ట్ కు రీవెరిఫికేషన్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ కు అప్లయి చేసుకోవాలి. ఎన్ని సబ్జెక్ట్స్ కి కావాలనుకుంటే అన్ని సబ్జెక్ట్స్ కి డబ్బులు చలాన్ తీసి దరఖాస్తుకు జత చేయాలి.