Voter ID Card : సాధారణంగా 18 ఏళ్లు వచ్చిన ప్రతి ఒక్క భారతీయుడు ఈ దేశంలో ఓటు హక్కును కలిగి ఉంటారు. అంటే వాళ్లు ఈ దేశంలో ఓటు వేయొచ్చు. కాకపోతే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటర్ ఐడీ కార్డు ఇస్తారు. ఆ కార్డు ద్వారా ఓటు వేయొచ్చు. అలాగే.. ఓటరు లిస్టులో పేరు ఎక్కిస్తారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్ వచ్చేసింది కాబట్టి 18 ఏళ్ల వచ్చిన ప్రతి ఒక్కరు ఓటరు ఐడీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు కోసం ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.
దానికి కావాల్సింది ఏజ్ ప్రూఫ్, రెసిడెన్షియల్ ప్రూఫ్. ఈ రెండు ఉంటే చాలు. ఓటర్ ఐడీ కార్డును పొందొచ్చు. ఏజ్ ప్రూఫ్ కోసం ఏదైనా ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పుట్టినప్పుడు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉన్నా సరిపోతుంది. లేదంటే ఆధార్ కార్డు ఉన్నా కూడా దాన్ని ఏజ్ ప్రూఫ్ గా చూపించవచ్చు. రెసిడెన్ష్ ప్రూఫ్ కోసం కూడా ఆధార్ కార్డును చూపించవచ్చు. లేదంటే.. రేషన్ కార్డు, పాస్ పోర్ట్, గ్యాస్ బిల్, ఫోన్ బిల్, కరెంట్ బిల్ ఏదైనా ప్రూఫ్ ను సబ్మిట్ చేయొచ్చు.
Voter ID Card : ఓటర్ ఐడీ కార్డు కోసం ఎక్కడ అప్లయి చేయాలి?
ఓటర్ ఐడీ కార్డు కోసం ఆన్ లైన్ లో అప్లయి చేసుకోవచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలే లేదు. నేషనల్ ఓటర్ సర్వీసెస్ అనే వెబ్ సైట్ ఉంటుంది. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. https://eci.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయి చేసుకోండి. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్ సర్వీసెస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది.
అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయి కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ ను అందులో యాడ్ చేయాలి. అంటే ఏజ్ ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ యాడ్ చేసి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీకి ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా ఓటర్ ఐడీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోగా కార్డు మీ ఇంటి అడ్రస్ కు వస్తుంది. అలాగే.. మీ పేరు ఓటర్ లిస్టులో ఎక్కుతుంది. ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఓటు వేసేందుకు హక్కు కలిగి ఉంటారు.