How To Become Rich : రిచ్ అవడం ఎలా? డబ్బులు బాగా సంపాదించడం ఎలా? మంచి ఇల్లు కట్టుకోవాలి.. కారు కొనుక్కోవాలి.. టూర్స్.. ఇలా చాలా రకాల కోరికలు చాలామందికి ఉంటాయి. అవన్నీ కోరికలే కాదనడం లేదు. చాలామంది మంచిగా బతకాలని అనుకుంటారు. కానీ.. దాని కోసం కష్టపడరు. నిజానికి కష్టపడితేనే డబ్బు వస్తుంది. డబ్బులు ఊరికే రావు. కానీ.. సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచే డబ్బును ఆదా చేసుకోవడం చాలామందికి తెలియదు. అది తెలియకనే చాలామంది పప్పులో కాలేస్తుంటారు. ఎంత సంపాదించినా కొందరి దగ్గర డబ్బు నిలవదు.
ఇలా డబ్బు విషయంలో చాలామంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. కొందరు సంపాదించరు. కొందరు సంపాదించినా ఆదా చేయరు. కానీ.. మీరు సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి డబ్బును పెట్టుబడి పెడుతూ పోతే కొన్నేళ్లలోనే ఆ డబ్బు మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. మీకు కోట్లను తెచ్చిపెడుతుంది. కానీ.. ఎలా పెట్టాలి.. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది చాలామందికి తెలియదు.
How To Become Rich : పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్సేనా?
చాలామంది పెట్టుబడి అంటే స్టాక్ మార్కెట్స్ అనే అనుకుంటారు. కానీ.. స్టాక్ మార్కెట్స్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. పెట్టుబడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ఉంది కానీ.. అందులో పెట్టుబడి పెట్టాలంటే కొంత మొత్తంలో డబ్బు కావాలి. అంత డబ్బు చాలామంది దగ్గర ఉండదు.
అటువంటి వాళ్లు రోజూ ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా కొన్నేళ్లలో కోట్లను వెనక్కివేసుకోవచ్చు. అదెలా సాధ్యం అంటారా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్. అవును.. మ్యూచువల్ ఫండ్స్ అనేది పెట్టుబడుల్లో బెస్ట్ ఆప్షన్.
దాని కోసం ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రోజుకు వంద రూపాయలు పెట్టుబడి పెట్టినా 30 ఏళ్లలో రూ.3 కోట్లు మీ చేతికి వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి అంత మార్జిన్ లో ప్రాఫిట్ ను తీసుకొస్తాయి. కాకపోతే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని ఎంచుకొని అందులో పెట్టుబడి పెట్టాలి. కనీసం ఒక 15 నుంచి 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే.. 30 ఏళ్లలో కోట్లు వస్తాయి. కానీ.. ఈ విషయం చాలామందికి తెలియక.. డబ్బును ఎలా ఆదా చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.
మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలంటే దాని కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా సమాచారం చెబుతారు. లేదంటే తెలిసిన వాళ్లను అడగొచ్చు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలను నేరుగా సంప్రదించినా వాళ్లు పెట్టుబడి పెట్టే ప్రొసీజర్ అంతా వివరిస్తారు. దాన్ని బట్టి ఎంత పెట్టుబడి పెట్టాలో మీరు నిర్ణయించుకోవచ్చు.