Calling To Blocked Numbers : మీకు ఎవరైనా ఊరికే ఫోన్ చేస్తుంటే నచ్చలేదు అనుకోండి ఏ చేస్తారు. వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేస్తారు. ఫ్రెండ్స్ అయినా లవర్ అయినా.. ఇంకెవరైనా వాళ్లతో గొడవ పడినా కూడా వెంటనే నెంబర్ ను బ్లాక్ చేస్తారు. వాళ్లకు ఫోన్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలో, వాట్సప్ లో అంతటా ఆ నెంబర్ ను బ్లాక్ చేస్తారు. అయితే.. అలా నెంబర్ ను బ్లాక్ చేసినా కూడా వాళ్లకు ఫోన్ చేయొచ్చు.. మెసేజ్ చేయొచ్చు. అలా ఎలా అంటారా? పదండి తెలుసుకుందాం.
దాని కోసం ఒక వెబ్ సైట్ ఉంది. గ్లోబ్ ఫోన్ అనే వెబ్ సైట్ ద్వారా ఈ పని చేయొచ్చు. Globfone అని నెట్ లో సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫ్రీగా వీడియో కాల్ చేయొచ్చు.. ఆడియో కాల్ చేయొచ్చు.. మెసేజ్ పంపించవచ్చు. కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ పేరు అడుగుతుంది. మీ పేరు ఇచ్చి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
Calling To Blocked Numbers : ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ల నెంబర్ టైప్ చేయండి
మీ పేరు ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ల పేరు టైప్ చేయాలి. ఆ తర్వాత మీ కంట్రీ పేరు సెలెక్ట్ చేసుకొని ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నారో వాళ్ల నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీంతో వెంటనే ఆ నెంబర్ కు కాల్ వెళ్తుంది. అది కూడా అన్ నోన్ నెంబర్ తో ఫోన్ వెళ్తుంది. ఎవరు చేశారు అనేది తెలియదు. నెంబర్ కూడా కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ చేసింది ఎవరు అని కనుక్కోవడం చాలా కష్టం.
మీరు ఎవరితోనైనా ముఖ్యమైన వాళ్లతో మాట్లాడాలని అనుకుంటే.. వాళ్లు మీ ఫోన్ ఎత్తకపోయినా.. మీ నెంబర్ ను బ్లాక్ లో పెట్టినా ఇలా ఫోన్ చేయొచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా ఫోన్ చేసి మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్లకు చేరవేయవచ్చు. ఒకవేళ ఫోన్ ఎత్తకపోతే.. మెసేజ్ కూడా చేయొచ్చు. వీడియో కాల్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీకు నచ్చిన ఆప్షన్ ద్వారా ఫోన్ చేసే అవకాశం ఉంటుంది.