Aadhaar Card Address Change : ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం చాలా కష్టం. నెలలకు నెలలు వెయిట్ చేయాలి అని చాలామంది అనుకుంటారు. మీసేవకు వెళ్లాలి. రిక్వెస్ట్ పెట్టాలి. దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్ సమర్పించాలి. అప్పుడు కానీ.. నెల రెండు నెలల తర్వాత ఆధార్ కార్డులో అడ్రస్ మారుతుంది. దాని కోసం ఒకటి రెండు రోజులు టైమ్ వేస్ట్ చేసుకోవాల్సిందే. కానీ.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అలా కాదు. ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా ఎలాంటి మార్పులు చేసుకోని వారికి.. కనీసం 10 ఏళ్లలో ఎలాంటి మార్పులు చేసుకోని వాళ్ల కోసం ఆధార్ వాళ్లు ఒక అవకాశాన్ని కల్పించారు.
మీసేవకు వెళ్లకుండానే ఆధార్ వెబ్ సైట్ లోనే సింపుల్ గా ఒక్క నిమిషంలో ఆధార్ కార్డును మార్చుకోవచ్చు. దాని కోసం ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లి అడ్రస్ మార్చుకోవచ్చు. ముందు myaadhaar.uidai.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి.. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
Aadhaar Card Address Change : అడ్రస్ ప్రూఫ్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది
ఓటీపీ వచ్చాక.. ఓటీపీని వెరిపై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్న ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో డాక్యుమెంట్ అప్ డేట్ అని కనిపిస్తుంది. కేవలం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉంటే చాలు. ఉచితంగానే ఈ సర్వీస్ ను ఉపయోగించుకునేలా ఆధార్ వాళ్లు అవకాశం కల్పించారు.
దాని మీద క్లిక్ చేసి కొత్త అడ్రస్ ను ఎంటర్ చేసి కొత్త అడ్రస్ ప్రూఫ్ ను అప్ లోడ్ చేయాలి. అంతే… కొత్త అడ్రస్ మీ ఆధార్ లోకి అప్ డేట్ అవుతుంది. దాని కోసం గంటలకు గంటలు మీసేవలో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ అడ్రస్ ను మార్చుకోవాలని అనుకుంటున్నారా వెంటనే పై వెబ్ సైట్ లోకి వెళ్లి వెంటనే మార్చుకోండి. మొబైల్ లో అయినా ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి మార్చుకోవచ్చు.