Mobile Charging : చాలామంది తమ ఫోన్లకు చార్జింగ్ గంటలకు గంటలు పెడుతుంటారు. కొందరు మొబైల్ అయితే ఎంత సేపు చార్జింగ్ పెట్టినా ఎక్కదు. ఇదేంటో తెలియదు కానీ.. ఇన్నిసార్లు చార్జింగ్ పెట్టాలా అనేంతగా కోపం వస్తుంది కొందరికి. రోజుకు మూడు నాలుగు సార్లు చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అయినా కూడా చార్జింగ్ ఎక్కదు. చాలా టైమ్ పడుతుంది. నార్మల్ చార్జర్, ఫాస్ట్ చార్జర్ ఏ చార్జర్ అయినా సరే.. గంటలకు గంటలు టైమ్ పడుతుంది మొబైల్ చార్జింగ్ కావడానికి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది. మొబైల్ చార్జింగ్ ఎందుకు ఇంత స్లోగా ఎక్కుతోంది అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి అసలు కారణాలు వేరే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి మొబైల్ చార్జింగ్ స్లోగా ఎక్కడానికి కారణాలు చాలా ఉంటాయి. ఫోన్ బ్యాటరీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇతర సెట్టింగ్స్ కారణాలు కూడా ఉండొచ్చు. అందుకే.. మీ మొబైల్ లో మీరు ఏ బ్రాండ్ మొబైల్ వాడినా ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు. మీ ఫోన్ జెట్ స్పీడ్ లో చార్జింగ్ అవుతుంది. అలాగే.. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాల సేపు ఇస్తుంది.
Mobile Charging : దాని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి ఇలా చేయండి
మీది ఏ బ్రాండ్ ఫోన్ అయినా సరే.. సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ బ్యాటరీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని పవర్ సేవర్ ఆప్షన్స్ ను సెలెక్ట్ చేసుకోండి. అందులో స్లీప్ స్టాండ్ బై ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేసుకొని ఉంచండి. ఆ తర్వాత బ్యాటరీ ఆప్షన్స్ లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆప్షన్ కు వెళ్లండి. డీఫాల్ట్ గా అది ఆఫ్ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ మోడ్ గా సెలెక్ట్ చేసుకోండి.
ఆ తర్వాత మీ మొబైల్ కు చార్జింగ్ పెట్టండి. మీరే తేడా గమనిస్తారు. ఎందుకంటే మీ ఫోన్ చార్జింగ్ లో వేగం పెరుగుతుంది. తొందరగా చార్జింగ్ అవుతుంది. అలాగే.. మీ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు తేడా తెలుస్తుంది. బ్యాటరీ అంత త్వరగా అయిపోదు. చాలామంది ఈ సెట్టింగ్స్ తెలియక ఫోన్ ను చాలా సేపు చార్జింగ్ పెడుతుంటారు. అలా చాలాసేపు చార్జింగ్ పెట్టడం కరెక్ట్ కాదు. ఫోన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే మీ ఫోన్ త్వరగా చార్జ్ అవుతుంది. ఇక.. బ్యాటరీ కూడా వేడెక్కే చాన్స్ ఉండదు.