Bank Loan on Property : ఏదైనా ప్రాపర్టీ కొనేముందు ఏ టూ జెడ్ చెక్ చేసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఆ ప్రాపర్టీ మీద పెట్టిన డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఎందుకంటే ఈరోజుల్లో ప్రాపర్టీ కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టడానికి ప్రాపర్టీ లీగలా కాదా.. జెన్యూనా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. గుడ్డిగా ప్రాపర్టీని తీసుకుంటే.. ఎలాంటి డాక్యుమెంట్స్ చెక్ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. అలా ప్రాపర్టీ కొన్న తర్వాత మోసపోయిన వాళ్లు చాలామందే ఉన్నారు.
ఒక్కోసారి లాండ్ ఓనర్స్ ఆ ప్రాపర్టీ మీద బ్యాంక్ లోన్ తీసుకొని అది ఎవ్వరికీ చెప్పకుండా ఆ విషయం దాచి పెట్టి ఆ ప్రాపర్టీని ఇంకొకరికి అమ్మేస్తారు. దాని మీద లోన్ ఉన్న విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు. లోన్ తీసుకొని ఆ లోన్ కట్టకుండా ఉంటారు. దీంతో బ్యాంకు వాళ్లు ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తారు. ఎందుకంటే.. ఆ ప్రాపర్టీ మీదనే లోన్ తీసుకున్నాడు కాబట్టి బ్యాంకు వాళ్లు ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తారు. అక్కడ మోసపోయేది ఆ ప్రాపర్టీని తీసుకున్న వ్యక్తి. అందుకే.. రియల్ ఎస్టేట్ లో జరిగే ఇలాంటి మోసాలను ముందే తెలుసుకోవాలి. దాని కోసం ఒక వెబ్ సైట్ ఉంది.
Bank Loan on Property : ప్రాపర్టీ లీగలా కదా.. అని ఎలా తెలుసుకోవాలి?
దాని కోసం ఒక వెబ్ సైట్ ఉంది. అదే సీఈఆర్ఎస్ఏఐ. అది కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్. సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్ సైట్ ద్వారా అసలు ప్రాపర్టీ జెన్యూనా కాదా అనే విషయం తెలుసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, ప్లాట్ అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ ఇల్లు అయితే ఇంటి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని వివరాలు ఇచ్చి సెర్చ్ చేస్తే ఆ ప్లాట్ కు సంబంధించిన అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి. ఒకవేళ ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ మీద లోన్ ఉంటే ఎంత లోన్ ఉంది.. అనేది కూడా తెలుస్తుంది.
లోన్ ఎవరు తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు. ఎంత వడ్డీ పడుతుంది. ఇప్పటి వరకు ఎంత కట్టారు. ఇంకా ఎంత కట్టాలి అనే వివరాలన్నీ అందులో కనిపిస్తాయి. కాకపోతే ఇది ఫ్రీ కాదు. కొంచెం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కువేం కాదు. చాలా తక్కువ ఫీజు తీసుకొని ఈ వివరాలను ఈ వెబ్ సైట్ అందిస్తుంది. అందుకే ప్రాపర్టీ కొనేముందు ఈ వెబ్ సైట్ లో ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. ఇక నో టెన్షన్.