UPI Payments : మీరు ఏదైనా షాపునకు వెళ్లారు. వస్తువులు తీసుకున్నారు. ఆ తర్వాత జేబులో డబ్బులు లేవు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు. సెల్ ఫోన్ ఉంది కదా. ఆన్ లైన్ లో యూపీఐ పేమెంట్ చేస్తారు. స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆన్ లైన్ లో ఏదైనా యాప్ నుంచి డబ్బులు పంపించవచ్చు అని అనుకుంటారు. కానీ.. సడెన్ గా మీ మొబైల్ లో నెట్ అయిపోతే ఏం చేస్తారు. అప్పుడు డబ్బులు పంపించడం కష్టం అవుతుంది కదా అంటారా? అవును.. కష్టం అవుతుంది కానీ.. దానికి ఒక సొల్యూషన్ ఉంది.
ఏంటి ఆ సొల్యూషన్.. వెళ్లి డేటా ప్యాక్ వేసుకోని రావడమే అంటారా? అది కాదు లేండి. దానికి ఒక సొల్యూషన్ ఉంది. యూపీఐ పేమెంట్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఫీచర్ ఇది. యూపీఐ పేమెంట్స్ కోసం మొబైల్ లో నెట్ లేకున్నా కూడా వేరే యూపీఐ నెంబర్ కి డబ్బులు పంపించే విధానం ఇది. దాని కోసం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
UPI Payments : ఇంటర్నెట్ లేకున్నా ఇలా చేస్తే ఆఫ్ లైన్ లో పేమెంట్స్ చేయొచ్చు
నెట్ లేకున్నా కూడా నీ డబ్బును యూపీఐ పేమెంట్ విధానంలో వేరే వాళ్లకు పంపించవచ్చు. దాని కోసం కొన్ని నెంబర్స్ ఉంటాయి. 08045163666, 6366200200, 08045163581. ఈ నెంబర్లకు కాల్ చేసి ఆఫ్ లైన్ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు.
మూడు నెంబర్లలో ఏదైనా నెంబర్ కు కాల్ చేసి ఆఫ్ లైన్ పేమెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఏ నెంబర్ కు డబ్బులు పంపించాలో ఆ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. మీరు షాపు వాళ్ల నెంబర్ తీసుకొని ఎంటర్ చేసి.. డబ్బులు ఎంత పంపించాలో కూడా సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత రెగ్యులర్ గా యూపీఐ యాప్స్ లో వాడే యూపీఐ పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే.. క్షణాల్లో పేమెంట్ అనేది ఆ యూపీఐ నెంబర్ కు వెళ్తుంది. సో.. మొబైల్స్ లో ఇంటర్నెట్ లేకున్నా కూడా ఆఫ్ లైన్ లో డబ్బులు పంపించుకోవచ్చు.
నిజానికి ఇది రిమోట్ ఏరియాలో బాగా పనిచేస్తుంది. నెట్ రాకున్నా.. మొబైల్ లో నెట్ ప్యాకేజీ అయిపోయినా కూడా సడెన్ గా ఎవరికైనా డబ్బులు పంపించాలని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ను ఉపయోగించడం బెటర్. లేదంటే నెట్ వచ్చే ప్లేస్ కి వెళ్లడం, లేదా నెట్ ప్యాకేజీ వేయించుకోవడం చేస్తుంటారు.