How To Start Fruit Juice Business : మీకు జాబ్ చేయడం ఇష్టం లేదా? ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? మీకు ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈరోజుల్లో ఏ బిజినెస్ అయినా కూడా బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఉద్యోగం కంటే కనీసం చాయ్ బండి పెట్టుకున్నా నెలకు 20 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పోను లాభాలు గడించవచ్చు. అందుకే చాలా మంది బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. సింపుల్ గా అందరూ ఇష్టంగా తాగే ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఈ బిజినెస్ ను ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా అనుభవం ఏం అవసరం లేదు. వెంటనే ఈ బిజినెస్ ద్వారా లాభాలు కూడా వస్తాయి.
ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ తో నెలకు కనీసం లక్ష వరకు సంపాదించుకోవచ్చు. అయితే.. ఫ్రూట్ జ్యూస్ బిజినెస్ కోసం కాస్త పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి అనేది ఒక్కసారి మాత్రమే పెడతారు. ఆ తర్వాత కేవలం పండ్లు కొనుక్కోవడమే. ఆ పెట్టుబడి కూడా జ్యూస్ షాపు సెటప్ కోసం. ఆ తర్వాత మున్సిపల్ ఆఫీసు నుంచి ఒక పర్మిషన్ పత్రం, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోవాలి.
How To Start Fruit Juice Business : పెట్టుబడి పోను ఎంత లాభం మిగులుతుంది
ఫ్రూట్ బిజినెస్ ద్వారా లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. రోజుకు కనీసం 200 మంది షాపునకు వచ్చినా.. ఒక్క జ్యూస్ 40 రూపాయలు. అంటే.. రోజుకు కనీసం రూ.8 వేల రూపాయల వరకు వస్తాయి. అదే నెలకు రూ.2,40,000 వరకు వస్తాయి. ఇందులో ఖర్చులు కూడా ఉంటాయి. కనీసం లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చులు పోను.. అటూ ఇటుగా లక్ష వరకు మిగులుతుంది. అంటే.. మీరు ఫ్రూట్ జ్యూస్ షాపు ద్వారా నెలకు అటూ ఇటుగా లక్ష రూపాయలు సంపాదించే చాన్స్ ఉంటుంది.
అయితే.. ఫ్రూట్ జ్యూస్ షాపు పెట్టగానే ఒక్క రోజులోనే లాభాలు రావు. అది రద్దీ ప్రాంతం అయితే ఓకే.. ఒక్కోసారి కొత్త షాపునకు కస్టమర్లు రావడానికి టైమ్ పడుతుంది. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అప్పుడే షాపునకు కస్టమర్లు వస్తుంటారు. అప్పటి నుంచి ఇక లాభాలు మొదలవుతాయి. అందుకే.. ఈ బిజినెస్ లో ఓపిక అనేది చాలాముఖ్యం. ఓపిక ఎంత ఉంటే ఇలాంటి బిజినెస్ లలో అంత లాభాలు గడించవచ్చు.