Side Income For Students : మీరు స్టూడెంటా? పార్ట్ టైమ్ ఏదైనా పని చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? కనీసం పాకెట్ మనీ కోసం అయినా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? సైడ్ ఇన్ కమ్ కాదు.. మీరు నెలకు కనీసం 50 వేల వరకు సంపాదించే బెస్ట్ ఐడియాలు ఇవి. దానికోసం మీరు రోజంతా కూర్చోవాల్సిన అవసరం లేదు. కొంచెం కష్టపడితే చాలు. నెలకు ఖచ్చితంగా ఈ పనులు చేసి 50 వేల కంటే ఎక్కువే సంపాదించే చాన్స్ ఉంటుంది.
మీకు దేని మీద ఆసక్తి ఉందో ముందు తెలుసుకోండి. ఆ ఆసక్తిని బట్టి మీరు డబ్బులు సంపాదించవచ్చు. మీకు కంటెంట్ రైటింగ్ అంటే ఆసక్తి ఉంటే ఈరోజుల్లో కంటెంట్ రైటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. బ్లాగ్స్ లో రాసి, ఏజెన్సీలకు కంటెంట్ రాసి డబ్బులు సంపాదించవచ్చు. ఆర్టికల్స్, బ్లాగ్స్, పోస్టులు రాయొచ్చు. మీకు ఏ భాషలో ప్రావీణ్యం ఉంటే ఆ భాషలో ఆర్టికల్స్ రాసి డబ్బులు సంపాదించవచ్చు. వెబ్ సైట్లకు, ఇతర బిజినెస్ లకు కూడా కంటెంట్ రాయొచ్చు.
Side Income For Students : మీకు యూఐ, యూఎక్స్ డిజైన్ అంటే ఇష్టమా?
మీకు డిజైనింగ్ చేయడం అంటే ఇష్టమా? అయితే యూఐ, యూఎక్స్ డిజైన్ చేసి ఖచ్చితంగా మీరు మంచి ఇన్ కమ్ సంపాదించవచ్చు. దాని కోసం కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. యూఐ, యూఎక్స్ డిజైన్ చేసే వెబ్ సైట్స్ చాలా ఉన్నాయి. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ లు క్రియేట్ చేసి బాగా డబ్బులు సంపాదించవచ్చు.
ఒకవేళ మీకు ప్రాడక్ట్ మేనేజ్ మెంట్ మీద ఆసక్తి ఉంటే ఆ రంగంలో రాణించవచ్చు. ప్రస్తుతం ఈ రంగానికి బాగా డిమాండ్ ఉంది. మీకు ఆర్గనైజ్ గా ప్రాజెక్ట్ లను మేనేజ్ చేయగలిగితే ఈ రంగంలో రాణించవచ్చు. ఆ తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా మంచి బూమ్ ఉన్న రంగం. సోషల్ మీడియా గురించి.. అందులో మార్కెటింగ్ చేసే దాని గురించి మీకు అవగాహన ఉంటే సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు.
మీకు వీడియో ఎడిటింగ్ మీద ఆసక్తి ఉంటే.. వీడియో ఎడిటర్ గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ బాగా డబ్బులు సంపాదించవచ్చు. వెబ్ డెవలప్ మెంట్ కూడా చేసి డబ్బులు బాగా సంపాదించవచ్చు. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ లాంటి టెక్నాలజీల మీద పట్టు ఉంటే మీరు వెబ్ డెవలపర్ గా డబ్బులు సంపాదించవచ్చు.