Damaged Luggage : ఈ మధ్య చాలామంది ఎయిర్ పోర్ట్ కి వెళ్తుంటారు. విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. విమానాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు లగేజ్ చాలా తక్కువ ఉండాలి. ఎక్కువ లగేజీ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. పెనాల్టీ వేస్తారు. అందుకే ఫిక్స్ లగేజీతో వెళ్తుంటారు. అయితే.. ఎయిర్ పోర్ట్ అనగానే ఎక్కువ మంది సూట్ కేసులు తీసుకెళ్తారు. వాటికి లాక్ వేస్తారు. ఎందుకంటే.. లగేజీని మనతో పాటు విమానంలోకి తీసుకెళ్లనీయరు. దాన్ని సపరేట్ గా పంపించాల్సి ఉంటుంది. మళ్లీ విమానం దిగాక మన లగేజీని ఇస్తారు.
ఈ సమయంలో లగేజీకి ఏదైనా అయితే ఎలా? డ్యామేజీ అయితే ఎలా? అందులోని వస్తువులు మిస్ అయితే ఎలా? ఎవరికి ఫిర్యాదు చేయాలి అని చాలామంది టెన్షన్ పడుతుంటారు. అటువంటి వాళ్లు చేయాల్సింది ఒక్కటే. ఒకవేళ మీరు బ్యాగ్ ఇచ్చినప్పుడు బాగానే ఉండి.. మీరు మళ్లీ బ్యాగ్ తీసుకునే సమయంలో బ్యాగ్ కి డ్యామేజీ అయితే వెంటనే మీరు డ్యామేజీ అయిన బ్యాగేజీ వీడియో రికార్డు చేయండి. మీరు ఏ ఎయిర్ పోర్ట్ లో ఉన్నా అక్కడ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు ఉంటారు.
Damaged Luggage : ఆ వీడియోను ఆధారంగా చూపించి ఫిర్యాదు చేస్తే రూ.20 వేలు ఇస్తారు
ప్రతి ఎయిర్ పోర్ట్ లో ఏఏఐ అధికారులు ఉంటారు. అక్కడికి వెళ్లి డ్యామేజీ అయిన లగేజీ వీడియో చూపించి డీపీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. డీపీఆర్ అంటే డ్యామేజీ ప్రాపర్టీ రిపోర్ట్ అన్నమాట. ఆ రిపోర్ట్ అప్రూవ్ అయితే ఎయిర్ లైన్స్ వద్ద నుంచి రూ.20 వేలు పరిహారంగా ఇప్పిస్తారు. అది డొమెస్టిక్ కి మాత్రమే వర్తిస్తుంది.
ఒకవేళ అంతర్జాతీయ ప్రయాణం అయితే మాత్రం డీపీఆర్ రిపోర్ట్ అప్రూవ్ అయితే రూ.1,50,000 వరకు పరిహారం ఇప్పిస్తారు. అందుకే.. మీరు వస్తువులు డ్యామేజీ అయినా.. బ్యాగ్ డ్యామేజీ అయినా.. వస్తువులు మిస్ అయినా ఆధారం కోసం వెంటనే దాన్ని వీడియో తీసి ఏఏఐ అధికారులకు చూపించి వెంటనే డీపీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ఒక్కోసారి డ్యామేజీని బట్టి మాత్రమే పరిహారం ఇస్తారు. తక్కువ డ్యామేజీ అయితే తక్కువ పరిహారం ఇస్తారు. ఎక్కువ డ్యామేజీ అయితే ఎక్కువ పరిహారం ఇస్తారు. అంతే కానీ.. ఫిక్స్ గా ఇంత ఇస్తారు అనడానికి కూడా ఒక్కోసారి చాన్స్ ఉండదు. అంతా.. డీపీఆర్ అప్రూవల్ ను బట్టి ఉంటుంది. డొమెస్టిక్ అయితే రూ.20 వేల వరకు పరిహారం పొందే చాన్స్ ఉంటుంది. అదే అంతర్జాతీయ ప్రయాణం అయితే రూ.1,50,000 వరకు పరిహారం పొందే చాన్స్ ఉంటుంది.