GoSats Card : మామూలుగా ఏ యాప్ లో అయినా, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసినా, ఇతర లావాదేవీలు చేసినా మనకు కేవలం క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ రూపంలో లేదంటే ఇండియన్ కరెన్సీ రూపంలో ఇస్తారు. కానీ.. అసలు బిట్ కాయిన్స్ నే క్యాష్ బ్యాక్ గా ఇవ్వడం ఎప్పుడైనా చూశారా? అదే మరి.. జనరేషన్ మారింది బాస్. ఇప్పుడు అంతా క్రిప్టో కరెన్సీ యుగంలో ఉన్నాం మనం. ఇంకొన్ని రోజులు ఆగితే అసలు డబ్బును మనం చేతులతో పట్టుకొని చూడటం ఉండదు. అంతా.. వర్చువల్ మనీనే. ఇంకా చెప్పాలంటే త్వరలోనే క్రిప్టో కరెన్సీ రోజులు రాబోతున్నాయి. దానికి ఎవ్వరి మీదా అథారిటీ ఉండదు. ఎవరికి వారే బాస్.
ప్రస్తుతం బిట్ కాయిన్, ఎథీరియం లాంటి క్రిప్టో కరెన్సీలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక్క బిట్ కాయిన్ ధర సుమారుగా రూ.25 లక్షల ఉంది. అదే ఎథీరియం ధర సుమారుగా రూ.1,50,000 ఉంది. రోజురోజుకూ క్రిప్టోకరెన్సీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే క్రిప్టోకరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు కూడా పెరుగుతున్నారు. క్రిప్టోకరెన్సీకి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఓ కంపెనీ ఏకంగా గో సాట్స్ పేరుతో ఒక కార్డును తీసుకొచ్చింది. ఆ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే బిట్ కాయిన్స్ ను క్యాష్ బ్యాక్ గా అందిస్తోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ కు ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. అందుకే ప్రస్తుతం ఈ కార్డుకు చాలా గుర్తింపు లభిస్తోంది. చాలామంది ఈ కార్డు కోసం ఎగబడుతున్నారు.
GoSats Card : ఈ కార్డును ఎలా తీసుకోవాలి?
ఈ కార్డు కావాలంటే ముందు గూగుల్ ప్లే స్టోర్, లేదా యాపిల్ స్టోర్ లో గో సాట్స్ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని పోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత పేరు ఇవ్వాలి. లాగిన్ అయ్యాక అందులో రెండు రకాల కార్డ్స్ ఉంటాయి అందులో ఒకటి ఎలైట్ కార్డు, ఇంకొకటి ఇంట్రో కార్డు. ఈ రెండు కార్డుల్లో ఏదైనా కార్డును తీసుకోవచ్చు.
ఆ కార్డుల ద్వారా ఎన్ని లావాదేవీలు చేస్తే అన్ని బిట్ కాయిన్స్ మీ అకౌంట్లలో వచ్చి చేరుతాయి. బిట్ కాయిన్ రేట్ పెరిగితే మీ వాలెట్ లో ఉన్న బిట్ కాయిట్స్ రేట్ కూడా పెరుగుతుంది. ప్రతి షాపింగ్ కు 1.5 శాతం బిట్ కాయిన్ ను క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారు. అలాగే.. అందులో పలు బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ వోచర్స్ తీసుకున్నా కూడా బిట్ కాయిన్స్ ను క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తారు. స్పిన్ వీల్ ఆప్షన్ కూడా ఉంటుంది. బిట్ కాయిన్స్ ను క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తున్నారు కాబట్టే ఈ కార్డుకు చాలా క్రేజ్ వచ్చేసింది.