Home Loan With Zero Interest : ఈరోజుల్లో హోమ్ లోన్ అనేది అందరికీ అవసరం. ఎందుకంటే సొంతింటి కల నెరవేరాలంటే లక్షలు, కోట్లు పెట్టాలి. అంత డబ్బు ఎవ్వరి దగ్గరా ఉండదు. అందుకే హోమ్ లోన్ కోసం బ్యాంకులను సంప్రదిస్తుంటారు. కానీ.. బ్యాంకుల్లో హోమ్ లోన్ ఇప్పుడు చాలా కాస్ట్ లీ అయింది. వడ్డీలు ఎక్కువ గుంజుతున్నారు. దాని వల్ల హోమ్ లోన్ తీసుకున్న ఓ 20 నుంచి 25 ఏళ్ల వరకు కంటిన్యూగా ఈఎంఐలు కడుతూనే ఉండాలి. కానీ.. జీరో వడ్డీతో 50 లక్షల వరకు హోమ్ లోన్ పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
సాధారణంగా ఎవరైనా ఒక 50 లక్షలకు హోమ్ లోన్ తీసుకుంటే.. కనీసం ఈరోజుల్లో బ్యాంకులు 8 శాతం వడ్డీని వేస్తాయి. 20 ఏళ్ల వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అంటే.. 20 ఏళ్లు పూర్తయ్యే సరికి మీరు తీసుకున్న 50 లక్షలకు అదనంగా మరో 50 లక్షలు వడ్డీనే కట్టాల్సి ఉంటుంది. అంటే మీరు తీసుకునేది రూ.50 లక్షలు. కానీ.. బ్యాంకుకు మాత్రం కోటి రూపాయల కంటే ఎక్కువే కడతారు. హోమ్ లోన్ అంటే అలాగే ఉంటది. కానీ.. ఈ చిన్న ట్రిక్ తో జీరో వడ్డీతో హోమ్ లోన్ తీసుకోవచ్చు.
Home Loan With Zero Interest : ఆ 50 లక్షల వడ్డీని ఇలా తప్పించుకోవచ్చు
హోమ్ లోన్ తీసుకున్నా రూ.50 లక్షల వడ్డీని తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. దాని కోసం మీరు నెలకు రూ.7500 పెట్టుబడి పెట్టాలి. 20 ఏళ్లకు మీరు హోమ్ లోన్ తీసుకుంటారు కాబట్టి అదే 20 ఏళ్లకు నెలకు రూ.7500 చొప్పున పెట్టుబడి పెట్టాలి. హోమ్ లోన్ కంటే ఎక్కువ వడ్డీ వచ్చే ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి. మీ హోమ్ లోన్ వడ్డీ 8 శాతం అనుకుంటే.. మీకు అంతకంటే ఎక్కువ వడ్డీ వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. అంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు 12 శాతం రిటర్న్స్ వస్తాయి.
ప్రతి నెల రూ.7500, 20 నెలల పాటు పెట్టుబడి పెడితే.. మీరు మొత్తం 18 లక్షల పెట్టుబడి పెడతారు. అందులో మీకు 12 శాతం రిటర్న్స్ వేసుకున్నా 20 ఏళ్ల తర్వాత మీకు కనీసం రూ.57 లక్షల వరకు వస్తాయి. అంటే టోటల్ గా మీరు పెట్టిన పెట్టుబడితో కలిపి కనీసం రూ.75 లక్షలు వస్తాయి.
ట్యాక్సులు పోను రూ.50 లక్షలు మిగిలినా.. అక్కడ హోమ్ లోన్ కు కట్టే వడ్డీ రూ.50 లక్షలు. ఇక్కడ వచ్చే రిటర్న్స్ రూ.50 లక్షలు. అంటే ఇన్ డైరెక్ట్ గా హోమ్ లోన్ కి జీరో వడ్డీ పే చేస్తున్నట్టే అవుతుంది.