Jio Fancy Number : రిలయెన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టెలికం నెట్ వర్క్ లో జియో అంటే టాప్ అని చెప్పుకోవచ్చు. ఎవరి ఫోన్ లో చూసినా జియో సిమ్ ఖచ్చితంగా ఉంటుంది. మిగితా సిమ్స్ లా కాకుండా జియో సిమ్ కావాలంటే ముందు సెలెక్ట్ చేసుకోవడం ఏముండదు. రాండమ్ గా జియో సిమ్ నెంబర్ ను ఇస్తారు. కానీ.. జియోలో ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఏం చేయాలి.. అనే విషయం చాలామందికి తెలియదు.
చాలామందికి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలని ఉంటుంది. లేదంటే లాస్ట్ 3 లేదా 4 డిజిట్స్ తమకు నచ్చిన నెంబర్స్ కావాలని అనుకుంటారు. కానీ.. అలా తమకు నచ్చిన నెంబర్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఎస్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చివర్లో మీ బైక్ లేదా కారు నెంబర్, లేదా మీకు నచ్చిన వేరే ఏదైనా నెంబర్ కావాలనుకున్నా సెట్ చేసుకోవచ్చు.
Jio Fancy Number : మీకు నచ్చిన నెంబర్ కావాలంటే వీఐపీ సిమ్ తీసుకోవచ్చు
మీకు నచ్చిన నెంబర్ కావాలంటే వీఐపీ సిమ్ తీసుకోవచ్చు. దాని కోసం మీరు మై జియో యాప్ లోకి వెళ్లండి. అక్కడ మెనూలోకి వెళ్లాలి. అక్కడ చాయిస్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మరో పేజీ వస్తుంది. అక్కడ లెట్స్ బుక్ ఇట్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన లక్కీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, లేదా ఏదైనా మీకు నచ్చిన నెంబర్ సిరీస్ అన్నీ ఎంటర్ చేయాలి.
దాని కోసం ముందు మీ పేరు, ఆ తర్వాత 4 నుంచి 5 డిజిట్స్ వరకు మీకు నచ్చిన నెంబర్ సిరీస్ ఎంటర్ చేసి మీ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ పిన్ కోడ్ ఏరియాలో ఆ నెంబర్ అందుబాటులో ఉందో లేదో చూపిస్తుంది. షో అవేలబుల్ నెంబర్స్ అనే బటన్ మీద కొడితే అందుబాటులో ఉన్న నెంబర్స్ గురించి చూపిస్తుంది.
అందులో మీకు నచ్చిన నెంబర్ ను సెలెక్ట్ చేసుకుంటే చాయిస్ నెంబర్ కోసం కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దానికి రూ.499 పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసిన తర్వాత 15 రోజుల్లో ఆ సిమ్ మీరు ఇచ్చిన అడ్రస్ కే వస్తుంది. అంతే.. సిమ్ రాగానే మీ ఫోన్ లో వేసుకొని దాన్ని యాక్టివేట్ చేసుకోవడమే. అందుకే మీకు నచ్చిన వీఐపీ నెంబర్ కావాలంటే ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది.