Non Coding IT Jobs : చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకుంటారు. కానీ.. అసలు ఏ కోర్సు నేర్చుకోవాలో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి కోడింగ్ అంటేనే భయం. వామ్మో.. కోడింగా నా వల్ల కాదు అంటారు. నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ ఉంటాయా? అసలు సాఫ్ట్ వేర్ జాబ్ అంటేనే కోడింగ్ కదా అని అపోహపడుతుంటారు. కానీ.. అలాంటి అపోహ అవసరం లేదు. ఎందుకంటే.. ఐటీ ఇండస్ట్రీలో చాలా రకాల జాబ్స్ ఉంటాయి. అందులో కోడింగ్ ఉన్నవి కొన్ని అయితే.. కోడింగ్ లేనివి కూడా కొన్ని ఉంటాయి.
కోడింగ్ లేని జాబ్స్ ఏంటి అనేవి చాలామందికి తెలియదు. కోడింగ్ లేకుండా చాలా జాబ్స్ ఉంటాయి. అది కూడా ఐటీ ఇండస్ట్రీలోనే. ఈ మధ్య కోడింగ్ లేని జాబ్స్ కి బాగా డిమాండ్ పెరుగుతోంది. మినిమం 6 లక్షల నుంచి ప్యాకేజీ స్టార్ట్ అవుతుంది. 18, 20 లక్షల వరకు కూడా ప్యాకేజీతో ఉద్యోగాలు కొట్టొచ్చు. కానీ.. నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ చేయాలంటే ఏ కోర్సు నేర్చుకోవాలి అనేది చాలామందికి తెలియదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.
Non Coding IT Jobs : ఏ కోర్సు నేర్చుకుంటే నాన్ ఐటీ జాబ్ వస్తుంది
నాన్ కోడింగ్ ఐటీ జాబ్ కావాలంటే చాలా కోర్సులు ఉన్నాయి. అందులో ఒకటి టెస్టింగ్. ఇందులోనూ చాలా రకాలు ఉంటాయి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమెషన్ టెస్టింగ్, ఎంబెడెడ్ టెస్టింగ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈ కోర్సులను సాఫ్ట్ వేర్ కోర్సులు అందించే ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకోవచ్చు.
ఒక్క టెస్టింగ్ మాత్రమే కాదు.. డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్, మొబైల్ యాప్ అండ్ సాఫ్ట్ వేర్ టెస్టింగ్, వెబ్ సైట్ టెస్టింగ్, గేమ్ టెస్టింగ్, యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్స్, యూజర్ ఎక్స్పీరియెన్స్ డిజైన్, గ్రాఫిక్స్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ ఇల్లుస్ట్రేషన్, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, టాబ్ల్యూ అండ్ పవర్ బీఐ, సీఎంఎస్ వెబ్ డిజైన్, ఎస్ఏపీ కన్ సల్టెంట్, ప్రాడక్ట్ మార్కెటింగ్ మేనేజర్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, సైబర్ సెక్యూరిటీ, టెక్ జర్నలిస్ట్, స్క్రమ్ మాస్టర్, ఐటీ బిజినెస్ అనలిస్ట్ లాంటి కోర్సులు నేర్చుకుంటే ఐటీ రంగంలో బెస్ట్ జాబ్ పొందొచ్చు.
ఈ కోర్సుల్లో ఏది నేర్చుకున్నా కూడా ఐటీలో ఉద్యోగం చేయొచ్చు. ఫ్రెషర్స్ అయితే కొన్ని కంపెనీలే ట్రెయినింగ్ ఇచ్చి మరీ ఉద్యోగాల్లో తీసుకుంటాయి. ఎక్స్ పీరియెన్స్ అయితే మాత్రం ఈ కోర్సుల్లో నిష్ణాతులై ఉండాలి. కొన్ని ప్రాజెక్టులు కూడా చేసి ఉండాలి. అప్పుడు ప్యాకేజీ కూడా భారీగానే ఉంటుంది.