How To Impress Manager : ఈరోజుల్లో చాలామంది ఉద్యోగులే ఉంటారు. ఎక్కువ మంది జాబ్స్ చేస్తుంటారు. కానీ.. తమ మేనేజర్ల ముందు చాలా ఇబ్బందులు పడుతుంటారు. సరిగ్గా పని చేయలేక.. పని చేసినా కూడా సరైన గుర్తింపు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే.. ఇది టెక్నాలజీ యుగం. ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా.. ఏదైనా మీటింగ్ ఉన్నా.. క్లయింట్ తో మీటింగ్ ఉన్నా.. ఇలా ఎలాంటి రిపోర్ట్స్ తయారు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో రిపోర్టులు తయారు చేయడం అనేది చిటికెలో వేసినంత పని అయింది.
చిటికె వేసినంతగా విజువలైజేషన్స్ తో రిపోర్టులను రెడీ చేయొచ్చు. దానికోసం తీసుకొచ్చిందే గ్రఫీ అనే యాప్. Graphy.app అనే వెబ్ సైట్ లోకి వెళ్లి మీరు మీకు కావాల్సిన రిపోర్టులను డేటా విజువలైజేషన్ ఫార్మాట్ లో చేసుకోవచ్చు. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా రిపోర్టును ఎక్సెల్ ఫార్మాట్ లో చేస్తారు. లేదంటే.. గూగుల్ షీట్స్ ఉపయోగిస్తారు. కానీ.. వాటిలో విజువలైజేషన్ అంతగా కనిపించదు. అటువంటి వాళ్లకు ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది.
How To Impress Manager : మీ ఎక్సెల్ లో డేటా ఉంటే ఇలా చేయండి
మీ దగ్గర ఎక్సెల్ లో డేటా ఉందా? అయితే.. ముందు ఇలా చేయండి. ఎక్సెల్ డేటాను తీసుకొని పైన చెప్పిన వెబ్ సైట్ ని ఓపెన్ చేసి ఆ డేటాను ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. వెంటనే మీకు కావాల్సిన డేటా విజువల్ గా చార్ట్స్ రూపంలో కనిపిస్తుంది.
అందులో చాలా రకాల చార్ట్స్ ఉంటాయి. మీకు నచ్చిన చార్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటే ఆ చార్ట్స్ లో డేటా విజువలైజ్ అవుతుంది. ఆ డేటాను ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. దాన్ని ఇమేజ్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవచ్చు. మేనేజర్ రిపోర్ట్స్ కావాలని అడిగితే ఇలా రిపోర్ట్స్ పంపిస్తే మేనేజర్ ఇంప్రెస్ అవడం ఖాయం. ఒకవేళ మీరు క్లయింట్ కి కానీ.. ఎవరికైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీరు ఈ వెబ్ సైట్ ఉపయోగించుకొని ప్రజెంటేషన్స్ ఇవ్వొచ్చు. డేటా విజువలైజేషన్ ఇందులో బాగుంటుంది. అందులోనూ ఈ వెబ్ సైట్ పూర్తిగా ఉచితం. ఇంకెందుకు ఆలస్యం.. మీ మేనేజర్ ను మీ రిపోర్ట్స్ తో వెంటనే ఇంప్రెస్ చేసి ప్రమోషన్ కొట్టేయండి. లేదా ప్రజెంటేషన్ ఇచ్చి అందరి ముందు సమ్ థింగ్ స్పెషల్ అనిపించుకోండి.