Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే ఈ న్యూస్ మీకోసమే. రేషన్ కార్డు ఉన్నవాళ్లు చాలామంది ఆధార్ కు లింక్ చేసుకోలేదు. ఆదార్ కార్డుకు లింక్ చేసుకుంటేనే ఇక నుంచి వాళ్ల రేషన్ కార్డు వర్క్ అవుతుంది. లింక్ చేసుకోకపోతే రేషన్ కార్డును క్యాన్సిల్ చేస్తారు. నిజానికి జూన్ 30, 2023 లోపే రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలి. కానీ.. చాలామంది లింక్ చేసుకోకపోవడం వల్ల.. డేట్ పెంచారు.
30 సెప్టెంబర్ 2023 లోపు లింక్ చేసుకోవాలి. చాలామంది ఫేక్ రేషన్ కార్డులను క్రియేట్ చేసుకొని ప్రభుత్వం పథకాలకు అప్లయి చేసుకొని లబ్ధి పొందుతున్నారు. అందుకే ఆ ఫేక్ రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియలో భాగంగానే ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని చెబుతోంది ప్రభుత్వం.
Ration Card : ఎలా లింక్ చేసుకోవాలి?
ఏ రాష్ట్రానికి చెందిన వారు అయితే.. ఆ రాష్ట్రానికి చెందిన ఫుడ్ అండ్ సిపిల్ సప్లయిస్ వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీకి చెందిన వాళ్లు https://aepos.ap.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి రేషన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. https://www.civilsupplies.telangana.gov.in/home4.aspx అనే వెబ్ సైట్ కి వెళ్లి తెలంగాణకి చెందిన వాళ్లు తమ రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు వెబ్ సైట్ లోకి వెళ్లి ఎలా లింక్ చేసుకోవాలో తెలియకపోతే.. మీకు దగ్గర్లోకి మీసేవా కేంద్రానికి వెళ్తే వాళ్లే మొత్తం లింక్ చేసి ఇస్తారు. అయితే.. తెలంగాణలో ఇప్పటికే చాలా మంది తమ రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారు. దానికి కారణం.. ఇప్పుడు అంతా ఆన్ లైన్ గా మారడం, ఆధార్ బయోమెట్రిక్ తో రేషన్ బియ్యాన్ని ఇస్తుండటం వల్ల.. ఆధార్ కార్డును ఇప్పటికే లింక్ చేసుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో ఆధార్ లింక్ చేసుకోని వారికి బియ్యం ఇవ్వడం లేదు. ఏపీలో మాత్రం చాలామంది ఇంకా తమ రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోలేదు. అందుకే.. వెంటనే పైన చెప్పిన వెబ్ సైట్ లోకి వెళ్లి లింక్ చేసుకోండి. లేదంటే మీకు సమీపంలోని ఏదైనా మీసేవా లేదా ఈసేవా సెంటర్ కు వెళ్లి మీ రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోండి. ఎంత వీలైతే అంత త్వరగా లింక్ చేసుకోండి. లేదంటే మీ రేషన్ కార్డు కూడా ఫేక్ అనుకొని దాన్ని ప్రభుత్వం తీసేసే అవకాశం ఉంది.