Reels Viral On Instagram : ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి దగ్గర విన్నా ఇన్‌స్టానే. ఇన్‌స్టాగ్రామ్ గురించే ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక వ్యసనంలా మారింది. చిన్నా లేదు పెద్దా లేదు.. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ మీద పడ్డారు. తమకు తెలిసిన టాలెంట్ ను ఇన్ స్టాలో రీల్స్ తీసి హడావుడి చేస్తున్నారు. నిజానికి ఇన్‌స్టాలో రీల్స్ చేయడం అనేది చాలా సింపుల్. ఎవ్వరైనా చేయొచ్చు కానీ.. ఆ ఇన్ స్టా రీల్స్ వైరల్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టపడాలి. ఒక్కోసారి ఎన్ని వీడియోలు చేసినా కూడా ఆ వీడియోలు అస్సలు వైరల్ కావు. అటువంటి సమయాల్లో ఏం చేయాలి.. ఏ ట్రిక్స్ ఫాలో అయితే ఇన్ స్టా రీల్స్ వైరల్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఇన్ స్టా రీల్స్ వైరల్ చేయాలనుకుంటే.. అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే. ఏ రీల్ పడితే ఆ రీల్ చేయడం కాకుండా కొంచెం ఆలోచించాలి. మీరు ఇన్ స్టాలో ఏదైనా రీల్ చూస్తున్నప్పుడు కింద వాళ్లు ఉపయోగించిన ఆడియో వివరాలు ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్రెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ట్రెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ట్రెండింగ్ లో ఉన్న అన్ని ఆడియో క్లిప్స్ మీకు కనిపిస్తాయి.
Reels Viral On Instagram : ట్రెండింగ్ లో ఉన్న ఆడియో క్లిప్స్ తో రీల్స్ చేయండి
ఎప్పుడైనా మీ రీల్స్ వైరల్ అవ్వాలంటే ట్రెండింగ్ లో ఉన్న ఆడియో క్లిప్స్ తోనే రీల్స్ చేయండి. ఆ ఆడియోతో రీల్స్ చేసి అప్ లోడ్ చేయండి. అప్పుడు ఇన్ స్టా ఆల్గారిథమ్ ఆ పోస్ట్ ను ఆటోమెటిక్ గా బూస్ట్ చేస్తుంది. దానికి కారణం మీరు ట్రెండింగ్ ఆడియో క్లిప్ ఉపయోగించి రీల్స్ చేశారు కాబట్టి.
అంతే కాదు.. మీరు ఏ రీల్ అయితే క్రియేట్ చేశారో.. దాని రిలేటెడ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. ట్యాగ్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే అక్కడ మీ రీల్ కు సంబంధించిన ట్రెండింగ్ ట్యాగ్స్ వస్తాయి. వాటినే మీ డిస్క్రిప్షన్ లో పెట్టండి.
అలా.. రోజుకు కనీసం ఒక్కటైనా ట్రెండింగ్ లో ఉన్న వీడియో చేస్తూ వెళ్లండి. ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మీ వీడియోలు ఇన్ స్టాలో వైరల్ అవుతాయి. వ్యూస్ బాగా వస్తాయి. అలాగే ఫాలోవర్స్ కూడా పెరుగుతారు.