Whatsapp Banking : మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఏ బ్యాంకులో ఉంది అంటే ఏదో ఒక బ్యాంకు పేరు చెబుతారు. ఇండియాలో చాలా బ్యాంకులు ఉన్నాయి. అవి ప్రైవేటు బ్యాంకులు కావచ్చు.. ప్రభుత్వ బ్యాంకులు కావచ్చు. ఏ బ్యాంకులు అయినా అందించే సర్వీసులు కామన్. కానీ.. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే.. ఆరోజు ఉన్న పని మానేసుకొని, ఆఫీసులకు వెళ్లే వాళ్లు ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ బ్యాంకులకు వెళ్లి పని చేసుకునేవాళ్లు.
కానీ.. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సర్వీసులు ఆన్ లైన్ లో చేసుకోలేమా? దాని కోసం మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు వచ్చాయి. అవి డబ్బులు పంపించుకోవడానికి, ఇతర సర్వీసుల కోసం ఉపయోగపడతాయి కానీ.. ఎంత మందికి మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ గురించి తెలుసు. చదువుకున్న వాళ్లు అంటే వాటి ద్వారా సర్వీసులను పొందగలరు కానీ.. చదువుకోని వారి పరిస్థితి. అటువంటి వాళ్ల కోసం వచ్చిన సర్వీసే వాట్సప్ బ్యాంకింగ్. ప్రస్తుతం వాట్సప్ ను అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి వాట్సప్ వాడే ప్రతి ఒక్కరు బ్యాంకింగ్ సర్వీసులను ఈజీగా వాడేలా అన్ని బ్యాంకులు తీసుకొచ్చిన సర్వీస్ ఇది.
Whatsapp Banking : వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు ఎలా పొందాలి?
వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ స్టేట్ మెంట్, మినీ స్టేట్ మెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటి వన్నీ వాట్సప్ లోనే చూసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే ముందు మీకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో.. ఆ బ్యాంక్ కు సంబంధించిన వాట్సప్ నెంబర్ తెలుసుకోవాలి.
ఉదాహరణకు మీకు ఎస్బీఐలో బ్యంక్ అకౌంట్ ఉంటే.. ఎస్బీఐ వాట్సప్ నెంబర్ 9022690226 గా ఉంటుంది. ఆ నెంబర్ ను మీ ఫోన్ లో సేవ్ చేసుకొని వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్ హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. మీ అకౌంట్ వివరాలన్నీ అక్కడ వస్తాయి.
బ్యాంక్ బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్, బ్యాంక్ స్టేట్ మెంట్ తో పాటు ఇతర బ్యాంకింగ్ సర్వీసులను కూడా వాట్సప్ ద్వారా బ్యాంకులు అందిస్తున్నాయి. వేరే బ్యాంకుల వాట్సప్ నెంబర్ ఇవే.
ఐసీఐసీఐ బ్యాంక్ వాట్సప్ నెంబర్ 8640086400, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాట్సప్ నెంబర్ 9264092640, బ్యాంక్ ఆఫ్ బరోడా నెంబర్ 8433888777, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెంబర్ 7070022222, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సప్ నెంబర్ 9666606060, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సప్ నెంబర్ 8376006006, యాక్సెస్ బ్యాంక్ వాట్సప్ నెంబర్ 7036165000, ఐడీబీఐ వాట్సప్ నెంబర్ 8860045678.