How To Recover Deleted Photos from Phone : మీ ఫోన్ లో ఏవైనా ముఖ్యమైన ఫోటోలు ఉన్నాయా? అవి పొరపాటున డిలీట్ అయ్యాయా? ఇప్పుడు ఏం చేయాలి. ముఖ్యమైన ఫోటోలను ఎలా మళ్లీ రికవరీ చేసుకోవాలని టెన్షన్ పడుతున్నారా? మీకు టెన్షన్ అనవసరం. ఎందుకంటే.. డిలీట్ అయిన ఫోటోలను మీరు మళ్లీ రికవరీ చేసుకోవచ్చు. దాని కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లోనే క్షణాల్లో డిలీట్ అయిన ఫోటోలు అన్నీ మళ్లీ రికవరీ చేసుకోవచ్చు. ఇప్పుడు కాదు.. 3 ఏళ్ల కింద డిలీట్ చేసిన ఫోటోలను కూడా మీరు రికవరీ చేసుకోవచ్చు. దాని కోసం మీరు చేయాల్సిందేంటో తెలుసుకుందాం రండి.
రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా మీ ఫోన్ లో డిలీట్ అయిన ఫోటోలు అన్నీ వెంటనే రికవరీ చేసుకోవచ్చు. దానికోసం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి డంప్స్టర్(Dumpster) అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ద్వారానే మీరు మీ ఫోటోలను రికవరీ చేసుకునే చాన్స్ ఉంది. ఈ యాప్ ఓపెన్ చేశాక.. అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. డీప్ స్కాన్ రికవరీ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
How To Recover Deleted Photos from Phone : డీప్ స్కాన్ చేయగానే ఫోటోలన్నీ కనిపిస్తాయి
డీప్ స్కాన్ చేయగానే మీరు డిలీట్ చేసిన ఫోటోలన్నీ వెంటనే అక్కడ కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం డిలీట్ చేసిన ఫోటోలు కూడా మీకు అందులో కనిపిస్తాయి. అందులో మీకు కావాల్సిన ఫోటోలు ఉంచుకొని మిగితావి డిలీట్ చేయొచ్చు.
దీని కోసం మీరు రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డిలీట్ అయిన ఫోటోలన్నీ రికవరీ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గూగుల్ ఫోటోస్ యాప్ ఉంటే.. మీరు దిగిన ఫోటోలన్నీ గూగుల్ ఫోటోస్ యాప్ లో కూడా కనిపిస్తాయి.
ఒకవేళ ఆ ఫోటోలన్నీ అనుకోకుండా డిలీట్ అయితే గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి అందులో గూగుల్ బిన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే.. ఫోటోలు డిలీట్ అయిన 30 రోజుల వరకు అందులో ఉంటాయి. కాబట్టి నెల రోజుల్లోపు డిలీట్ అయిన ఫోటోలను అందులో నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు.
మీరు రికవరీ చేసుకున్న ఫోటోలను మళ్లీ రీస్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి మీ ఫోన్ లో స్టోర్ అవుతాయి. లేకపోతే స్టోర్ కావు. కాబట్టి ఖచ్చితంగా రికవరీ చేసుకున్న ఫోటోల్లో ఏది కావాలో అదే రీస్టోర్ చేసుకోండి.