How To Recover Loan From Friend : చాలామంది ఫ్రెండ్స్ కు అవసరాల్లో డబ్బు ఇస్తుంటారు. వడ్డీలకు ఆశపడి కాదు కానీ.. ఫ్రెండ్ అవసరాల్లో ఉన్నాడంటే కొందరు డబ్బులు ఏమాత్రం ఆలోచించకుండా ఇస్తారు. వన్ వీక్ లో ఇచ్చేస్తా లేదా.. ఒక నెలలో ఇచ్చేస్తా అని ఫ్రెండ్స్ చెబుతుంటారు. సర్లే.. అర్జెంట్ అంటున్నాడు కదా.. ఏం చేస్తాం.. మళ్లీ తిరిగి ఇచ్చేస్తాడు కదా.. మన దగ్గర ఉన్నా ఖర్చువుతాయి అని అనుకొని చాలామంది ఫ్రెండ్స్ కు కొందరు డబ్బులు ఇస్తుంటారు. అసలు ఇలా డబ్బులు ఎవ్వరికి పడితే వాళ్లకు ఇస్తే ఆ తర్వాత మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాళ్లు ఎంత మీ ఫ్రెండ్స్ అయినా ఖచ్చితంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు మీ ఫ్రెండే కదా.. ఏమౌతుంది. వాడు మళ్లీ తిరిగి ఇస్తాడులే అనుకుంటారు. కానీ.. డబ్బులు ఇవ్వడానికి ముందు ఒకలా ఉంటే.. డబ్బులు ఇచ్చిన తర్వాత కొందరు ఒకలా ఉంటారు. నెలలో ఇస్తా అన్న వ్యక్తి సంవత్సరం అయినా తిరిగి ఇవ్వడు. రూపాయి కూడా ఇవ్వడు. ప్రతి సారి అడిగితే కొందరు అయితే దబాయిస్తారు. ఇంకొందరు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. అటువంటి సమయాల్లో ఫ్రెండ్స్ కు ఇచ్చిన డబ్బును ఎలా రాబట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
How To Recover Loan From Friend : ఫ్రెండ్ కు డబ్బులు ఇచ్చినట్టు మీదగ్గర ప్రూఫ్ ఉంటే చాలు
మీరు మీ ఫ్రెండ్ కు డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ఆ ప్రూఫ్ తో ఆ డబ్బులను వెనక్కి తెచ్చుకోవచ్చు. మీరు క్యాష్ ఇస్తే కష్టం కానీ.. ఒకవేళ ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే దానికి సంబంధించిన రిసీప్ట్ మీ దగ్గర ఉంటుంది కదా. ఆ రిసీప్ట్ తీసుకొని ఒక లాయర్ దగ్గరికి వెళ్లి ఆ లాయర్ ద్వారా మీ ఫ్రెండ్ కు ఒక లీగల్ నోటీసు పంపించండి.
ఆ లీగల్ నోటీసు చూశాక చాలామంది డబ్బులు వెంటనే వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ వాళ్లు డబ్బులు వెనక్కి ఇచ్చేయకపోతే వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి కోర్టులో మనీ సూట్ ఫైల్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా డబ్బులు తీసుకున్న వాళ్లు కోర్టుకు రావాల్సిందే. మనీ సూట్ ఫైల్ చేసేముందు మీరు మీ ఫ్రెండ్ కు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుతో పాటు.. కోర్టు చార్జీలు అన్నీ కలిపి రికవరీ కోసం మనీ సూట్ ఫైల్ చేయండి. మీరు కేసు గెలిస్తే ఖచ్చితంగా ఆ డబ్బు మీ ఫ్రెండ్ తిరిగి ఇచ్చేయాల్సిందే. వాళ్లకు మరో ఆప్షన్ అస్సలు ఉండదు.