Deleted Photos : చాలామంది మొబైల్ లో చాలా ఫోటోలను సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫోటోలు తీయడం అనేది పెద్ద పని కాదు కదా. ఎక్కడికెళ్లినా చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటే చాలు. చిటికెలో ఫోటోలను కెమెరాతో తీయొచ్చు. చాలామంది ఫోటోలు దిగడం కోసం, పలు ప్రాంతాలను ఫోటోలు తీయడం కోసమే వెళ్తుంటారు. ఫోటోలు తీయడానికి చాలా కష్టపడుతుంటారు. అటువంటి వాళ్లు ఫోటోలు తీసిన తర్వాత మొబైల్ లోనే సేవ్ చేసుకుంటారు. కానీ.. పొరపాటున ఆ ఫోటోలు డిలీడ్ అయితే మాత్రం ఇక వాళ్ల పరిస్థితి మామూలుగా ఉండదు బాబోయ్.
అయ్యో ఎంత కష్టపడి తీసిన ఫోటోలు అన్నీ డిలీట్ అయిపోయె.. ఇప్పుడు ఎలా.. ఏం చేయాలి అని టెన్షన్ పడుతుంటారు. అటువంటి వాళ్లు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే చాలు మీ ఫోటోలు అన్నీ మళ్లీ తిరిగి వస్తాయి. పర్మినెంట్ గా డిలీట్ అయిన ఫోటోలు అయినా సరే.. మళ్లీ తిరిగి తీసుకురావచ్చు. దానికోసం మీరు ఇలా చేయండి. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి డిస్క్ డిగ్గర్ ఫోటో రికవరీ అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి.
Deleted Photos : ఆ యాప్ ఓపెన్ చేసి ఇలా చేస్తే పర్మినెంట్ గా డిలీట్ అయిన ఫోటోలన్నీ రికవరీ అవుతాయి
ఆ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ ఫర్ లాస్ట్ ఫోటోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫోటోలను డిలీడ్ చేశారో ఆ ఫోటోలు అన్నీ రికవరీ చేయొచ్చు. కాకపోతే ఆ ఫోటోల క్వాలిటీ అంత బాగుండదు. ఫోటోలు క్వాలిటీ లేకపోయినా ముఖ్యమైన ఫోటోలు అయితే అన్నీ రికవరీ చేసుకోవచ్చు.
ఒకవేళ ఆ ఫోటోల క్వాలిటీ పెంచాలని అనుకుంటే మాత్రం రెమిని(Remini) అనే యాప్ యూజ్ చేసి ఫోటో క్వాలిటీ పెంచుకోవచ్చు. అందుకే మీకు ముఖ్యమైన ఫోటోలు ఏవైనా డిలీట్ అయితే ఇక అస్సలు టెన్షన్ పడకండి. ఖచ్చితంగా ఆ ఫోటోలను మళ్లీ రికవరీ చేసుకోవచ్చు. కాకపోతే పైన చెప్పిన యాప్ మీ ఫోన్ లో ఇన్ స్టాల్ అయి ఉండాలి. లేదంటే మీరు ఇన్ స్టాల్ చేసుకొని ఫోటోలను రికవరీ చేసుకోండి. క్వాలిటీ కోసం రెమిని యాప్ ను ఉపయోగించండి. ఇక నుంచి ఫోటోలు డిలీట్ అయ్యాయని అస్సలు టెన్షన్ పడకండి. మీరు ఫోన్ కొన్నప్పటి నుంచి డిలీట్ చేసిన ఫోటోలను కూడా ఈ యాప్ ద్వారా రికవరీ చేసుకునే చాన్స్ ఉంటుంది.