How To Settle Unclaimed LIC Policy : మీరు ఎల్ఐసీ పాలసీ కట్టారా? మీరు కాకపోతే మీ తాతో, మీ నాన్నో, మీకు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎల్ఐసీ పాలసీ కట్టారా? కట్టిన పాలసీని క్లెయిమ్ చేసుకోలేదా? అయితే మీకో సువర్ణావకాశం. ఇలా.. ఎల్ఐసీ పాలసీలు కట్టి ఆ తర్వాత పాలసీ మెచ్యూర్ అయ్యాక డబ్బులను క్లెయిమ్ చేసుకోని వాళ్లు చాలా మంది ఉన్నారట. అటువంటి వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ.
ముఖ్యంగా మన తాతలు కానీ.. తండ్రులు కానీ.. కుటుంబ సభ్యులు కానీ ఎల్ఐసీ పాలసీ కట్టి ఆ తర్వాత వాళ్లు ప్రమాదవశాత్తు మరణించినా.. అది మెచ్యూర్ అయినా దాని గురించి తెలియక క్లెయిమ్ చేసుకోరు. అసలు వాళ్లు ఎల్ఐసీ పాలసీ కట్టారనే విషయమే మనకు తెలియదు. అప్పుడు అవి మెచ్యూర్ అయినా కూడా వాటిని క్లెయిమ్ చేసుకోం. ప్రీమియం కట్టిన వాళ్లు బతికి ఉండకపోతే దాని గురించి ఎవ్వరికీ తెలియదు. అలా.. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఎల్ఐసీ ప్రీమియం కట్టారని భావిస్తే.. వాళ్ల ప్రీమియానికి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని క్లెయిమ్ చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకొని వెంటనే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
How To Settle Unclaimed LIC Policy : సెటిల్ కాని అమౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
ఎల్ఐసీ దగ్గర ఇప్పటి వరకు రూ.21,500 కోట్లు అన్ క్లెయిమ్ అమౌంట్ ఉందట. అంటే.. రూ.21,500 కోట్ల డబ్బును ఎల్ఐసీలో కట్టి మెచ్యూర్ అయినా కూడా క్లెయిమ్ చేసుకోలేదట. అందుకే.. మీ ఇంట్లోని వాళ్లు ఎల్ఐసీ కట్టి క్లెయిమ్ చేసుకోలేదు అని మీకు అనిపిస్తే ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చేక్ చేసుకోవచ్చు.
Licindia.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత customer services అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ Unclaimed Amounts of Policyholders అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఎల్ఐసీ పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అవన్నీ ఎంటర్ చేశాక.. ఆ ఎల్ఐసీ పాలసీని క్లెయిమ్ చేశారా? లేదా అనే విషయాలు అక్కడ కనిపిస్తాయి. ఆ వివరాలు తీసుకొని నామినీని తీసుకొని మీకు దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసుకు వెళ్లి ఆ డబ్బును వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇలా.. క్లెయిమ్ చేసుకోని అమౌంట్ వేల కోట్లలో ఉండటంతో క్లెయిమ్ చేసుకోవడం కోసం ఎల్ఐసీ ఈ అవకాశాన్ని ఎల్ఐసీ పాలసీదారులకు కల్పించింది.