Bank Loan Recovery : ఈరోజుల్లో బ్యాంకు నుంచి లోన్ తీసుకోని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. బ్యాంక్ లోన్ తీసుకోకుండా ఏ ప్రాపర్టీ కొనలేం. చివరకు ఇల్లు కూడా కట్టలేం. అందుకే బ్యాంక్ లోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ మధ్య బ్యాంకులు కూడా పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి. పిలిచి మరీ లోన్లు ఇస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. అందుకే ఎగబడి మరీ అవసరం ఉన్నా లేకున్నా లోన్లు తీసుకుంటున్నారు జనాలు. చివరకు ఆ లోన్ల ఈఎంఐలు కట్టలేక చాంతాడంత పెరిగి చివరకు ఏజెంట్ల వేధింపులకు గురవ్వాల్సి వస్తుంది.
కానీ.. ఇక నుంచి అలాంటి టెన్షన్స్ అవసరం లేదు. ఎందుకంటే.. ఒకవేళ మీరు ఏ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా.. ఆ లోన్ కట్టలేకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే. మీ దగ్గర ప్రస్తుతం ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేకపోతే ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ యాక్ట్(SARFAESI ACT) 2002 ప్రకారం మీరు బ్యాంకు నుంచి 60 రోజుల వరకు నోటీసు పీరియడ్ తీసుకోవచ్చు.
Bank Loan Recovery : బ్యాంకు వాళ్లు 60 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వకపోతే?
మీరు బ్యాంకు నుంచి 60 రోజుల నోటీసు పీరియడ్ ఆ యాక్ట్ ప్రకారం తీసుకోవచ్చు. అంటే.. 60 రోజుల వరకు ఎలాంటి ఈఎంఐలు పే చేయనని.. తనను ఏజెంట్లు ఇబ్బంది పెట్టకూడదని ఒక అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అది ఇచ్చేస్తే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 60 రోజుల వరకు మిమ్మల్ని ఏ ఏజెంట్ వేధించడు, ఫోన్ చేయడు.. మీ ఇంటికి రాడు.
ఒకవేళ బ్యాంకు వాళ్లు మీకు 60 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే కంజ్యూమర్ కోర్టులో ఆ బ్యాంకు మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఖచ్చితంగా 60 రోజుల పాటు మీకు నోటీసు పీరియడ్ ఇస్తాడు. ఆ సమయంలో ఏజెంట్స్ రాకపోవడమే కాదు.. లీగల్ గా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోరు.
కానీ.. 60 రోజుల తర్వాత మాత్రం బ్యాంకుకు డబ్బులు కట్టకపోతే అప్పుడు బ్యాంకుకు లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకునే చాన్స్ ఉంటుంది. అందుకే.. ఖచ్చితంగా రెండు నెలల తర్వాత మీరు డబ్బులు కడుతామనే నమ్మకం ఉంటేనే బ్యాంకు నుంచి 60 రోజుల గ్యారెంటీ తీసుకోండి. లేకపోతే మీకు తర్వాత డబ్బులు కోర్టు ద్వారా కట్టాల్సి వస్తుంది.
బ్యాంకు లోన్ తీసుకున్నప్పుడు విధిగా ఈఎంఐ కట్టలేని వాళ్లకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. కాకపోతే 60 రోజుల పాటు లోన్ కట్టకుండా ఉండేందుకు వాళ్లు కొన్ని చార్జీలు తీసుకుంటారు. ఆ చార్జీలు కూడా భరించడానికి ఓకే అనుకుంటేనే 60 రోజుల నోటీస్ పీరియడ్ తీసుకోండి.