Track Location With Photo : ఒక్క ఫోటో ఉంటే చాలు.. మీకు కావాల్సిన వాళ్లు, మీరు ఎవరిదైనా లైవ్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే క్షణాల్లో తెలుసుకోవచ్చు. కొందరు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడున్నారు అంటే అబద్ధం చెబుతారు. ఇక్కడ లేను.. అక్కడ లేను.. అక్కడికెళ్లా.. ఇక్కడికెళ్లా అంటూ దాటవేత సమాధానాలు చెబుతుంటారు. ఊరిలో ఉన్నా.. సిటీలో లేను. వచ్చాక ఫోన్ చేస్తా అంటూ ఏవేవో కుంటి సాకులు చెబుతుంటారు. అలాంటి వాళ్ల లైవ్ లొకేషన్ ఎలా ట్రాక్ చేయాలి. దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? అంటే డెఫినెట్ గా ఉంది. వాళ్ల లైవ్ లొకేషన్ ను ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
దాని కోసం మీరు చేయాల్సింది ఒక్కటే. మీ పోన్ లో పిక్ 2 మ్యాప్(pic2map) అనే యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి. అయితే.. ఆ యాప్ మీ దగ్గర ఉంటే మీరు ఇంకో పని చేయాలి. మీరు ఎవరిదైతే లైవ్ లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్లకి సంబంధించిన ఏదైనా ఒక రీసెంట్ ఫోటోను సంపాదించాలి. వాళ్ల సోషల్ మీడియాలో ఏదైనా లేటెస్ట్ గా ఫోటో పెడితే ఆ ఫోటో తీసుకోండి. ఆ ఫోటోను మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసుకోండి.
Track Location With Photo : యాప్ లో ఆ ఫోటోను అప్ లోడ్ చేయండి
ఆ ఫోటోను మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి ఆ ఫోటోను అప్ లోడ్ చేయండి. అంతే.. ఆ ఫోటో ఏ కెమెరాతో తీశారు. ఫోన్ తో తీస్తే ఏ ఫోన్, మోడల్ ఏంటి.. లెన్స్, దానితో పాటు.. ఎక్కడ తీశారు.. లొకేషన్ ఏంటి అనే వివరాలు అన్నీ ఇస్తుంది.
వాళ్లు ఎక్కడైతే ఫోటో తీస్తారో దానికి సంబంధించిన లొకేషన్ ను మీకు చూపిస్తుంది. అంతే.. ఆ లొకేషన్ కు మీరు వెళ్లి వాళ్లను డైరెక్ట్ గా కలుసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆ యాప్ లేకున్నా కూడా గూగుల్ లో పిక్ 2 మ్యాప్ అని టైప్ చేస్తే మీకు వెబ్ సైట్ వస్తుంది. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి అయినా వాళ్ల లొకేషన్ ను తెలుసుకోవచ్చు.
చాలామంది అబద్ధాలు చెప్పే వాళ్లకు, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలి కానీ.. మోసాలు చేయడానికి, ఇతర కుట్రాలకు, కుతంత్రాల కోసం మాత్రం ఇలాంటి ఫీచర్లను ఉపయోగించుకోకూడదు. అది చట్టరీత్యా నేరం అవుతుంది.