Slap : చాలామంది తమను అకారణంగా ఎవరైనా కొడితే ఏం చేయాలో తెలియదు. అసలు మేం ఏం అనకున్నా మా తప్పు లేకున్నా కూడా మమ్మల్ని కొట్టారు. మా చెంప చెళ్లుమనిపించారు. అప్పుడు ఏం చేయాలి. వాళ్లను తిరిగి కొట్టలేను. కానీ.. వాళ్ల మీద లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చా అని కొందరు అడుగుతుంటారు. అవును.. మిమ్మల్ని ఎవరైనా అకారణంగా కొడితే ఖచ్చితంగా వాళ్ల మీద మీరు లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు. చట్టప్రకారం ఎవ్వరైనా సరే.. వాళ్లు మీ సొంత వాళ్లు అయినా, ఫ్రెండ్స్ అయినా.. లేక తెలియని వాళ్లు ఎవ్వరైనా సరే.. మిమ్మల్ని అకారణంగా.. మీ తప్పు లేకున్నా మిమ్మల్ని కొడితే.. మీ మీద చేయి చేసుకుంటే మీరు వాళ్ల మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కొందరు కావాలని ఊరికే కొడుతుంటారు. అలా ఊరికే కొట్టినా కూడా అది కేసే అవుతుంది.
ఎలాంటి కారణం లేకుండా మిమ్మల్ని కొట్టినా, హింసించినా, చెంప మీద కొట్టినా ఖచ్చితంగా అది మిమ్మల్ని మానసికంగా వేధించినట్టే అవుతుంది. బయటి వాళ్లు ఎవరైనా కోపంతో మీతో గొడవ పడినప్పుడు కొడితే వాళ్ల మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఐపీసీ సెక్షన్ 323 కింద వాళ్ల మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఈ సెక్షన్ ఏం చెబుతుందంటే పనిష్ మెంట్ ఫర్ వాలంటరిలీ కాజింగ్ హర్ట్.. అంటే కావాలని ఎవరినైనా బాధిస్తే, వేధిస్తే, హర్ట్ చేస్తే ఈ సెక్షన్ కింద కేసు పెట్టొచ్చు అన్నమాట.
Slap : ఈ కేసు కింద సంవత్సరం జైలు శిక్ష వేసే చాన్స్
ఈ సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తే వాళ్ల నేరం రుజువు అయితే వాళ్లకు సంవత్సరం జైలు శిక్ష, అలాగే భారీ జరిమానా కూడా కోర్టు విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి రెండు శిక్షలు ఒకేసారి విధిస్తారు. ఒక్కోసారి కేసు చిన్నదే అయితే జరిమానా విధించి వదిలేస్తారు.
మిమ్మల్ని బయట వాళ్లు ఎవరైనా అకారణంగా, కావాలని మీ మీద చేయి చేసుకుంటే.. వాళ్లపై తిరిగి దాడి చేయకండి. ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం వాళ్ల మీద కేసు ఫైల్ చేయండి అంతే. కోర్టే మిగితాది చూసుకుంటుంది. మిమ్మల్ని కొట్టినందుకు వాళ్లు కనీసం సంవత్సరం పాటు బాధపడతారు. వాళ్లు ఒక్క దెబ్బ కొట్టినా.. వంద దెబ్బలు కొట్టినా.. వాళ్లకు మాత్రం జైలు శిక్ష ఖాయం. అలాగే.. భారీ జరిమానా కూడా విధిస్తారు. అందుకే ఇక నుంచి ఎవరు మిమ్మల్ని కొట్టినా జస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయండి అంతే.