Debt : ఈరోజుల్లో అప్పు లేని వాళ్లు ఎవ్వరూ ఉండరు. దాదాపుగా నూటికి 90 మంది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అప్పు తీసుకుంటూ ఉంటారు. అప్పు చేయొద్దని మనసులో ఉన్నా.. అది ఎలాగోలా అప్పు చేయిస్తుంది. మనతో అప్పు చేయించి ఆ తర్వాత ముప్పు తిప్పలు పెడుతుంది. అసలు రూపాయి కూడా అప్పు లేకుండా ప్రశాంతంగా బతికే వాడు ఎలా ఉంటాడు చెప్పండి.. అప్పు చేసుకొని నెలనెలా వడ్డీలు కట్టలేక టెన్షన్ పడేవాడు ఎలా ఉంటాడు చెప్పండి. అందుకే.. అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. అయినా కూడా మనవాళ్లు వినరు కదా. ఏదో ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుంది. అప్పు చేసేస్తారు.. ఆ తర్వాత దాన్ని తీర్చలేక నానా యాతన పడుతుంటారు.
కానీ.. అప్పు తీసుకున్నాక సమయానికి తీర్చలేని వాళ్లు కొందరు ఉంటారు. వాళ్లు వడ్డీకి ఎవరి వద్ద అయినా తీసుకున్నా సరే.. బ్యాంకులో లోన్స్ తీసుకున్నా సరే.. ఎలా అయినా వాళ్లు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు వాళ్లు ఏం చేయాలి? సమయానికి అప్పు కట్టడం లేదని బ్యాంకు వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తే, రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపించి రచ్చ రచ్చ చేస్తే, ఫోన్లు చేసి వేధిస్తే ఎలా? వాళ్లను ఎలా ఎదుర్కోవాలి.. అనేది చాలామందికి తెలియదు. ఒకవేళ మీరు అప్పు తీసుకొని కట్టలేకపోతే.. కొన్ని రోజుల వరకు అప్పు కట్టలేను.. పరిస్థితులు బాగాలేవు.. అప్పు తీర్చడానికి కొంత సమయం కావాలని మీరు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు.
Debt : డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే చాలు
మీకు ఒక రెండు మూడు సంవత్సరాల సమయం కావాలని, ఆ సమయంలో డబ్బులు సంపాదించి ఆ తర్వాత తీసుకున్న అప్పు మొత్తం తీర్చేస్తానని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంటే.. కోర్టు మీకు డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తుంది. ఈ ఆర్డర్ ఇస్తే ఇక మీ జోలికి ఏ బ్యాంకు రాదు. వాళ్లు కోర్టు ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారు. ఉదాహరణకు మీకు రెండేళ్లకు కోర్టు డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తే ఆ రెండేళ్ల పాటు ఏ బ్యాంకు కూడా మీరు తీసుకున్న లోన్ కట్టాలని అడగదు. ఫోన్ చేయదు. రికవరీ ఏజెంట్లను ఇంటికి పంపించదు. ఇంటికి ఎవ్వరూ రారు. రెండేళ్ల తర్వాతనే మీరు తీసుకున్న అప్పును కట్టేయొచ్చు. అప్పు చేసి కట్టలేక చాలామంది డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. కొందరైతే ఏకంగా సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ల కోసమే మన చట్టంలో డైనమిక్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది. అది తీసుకుంటే ఇక మీకు నో టెన్షన్. రెండేళ్లు కష్టపడి డబ్బులు సంపాదించి తిరిగి కట్టేయొచ్చు.