Relationship Law : ఈరోజుల్లో తాళి కట్టేదాక కూడా ఆ పెళ్లి జరుగుతుందో లేదో కూడా డౌటే. ఒక్కసారి తాళి కడితేనే ఇక ఆ పెళ్లి జరిగినట్టుగా కన్ఫమ్ చేసుకోవాలి. లేదంటే ఆ పెళ్లి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కొన్ని పెళ్లిళ్లు అయితే పెళ్లి పీటల మీద ఆగిపోతాయి. కొన్ని ఎంగేజ్ మెంట్ కి ముందు ఆగిపోతాయి. మరికొన్ని ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఆగిపోతాయి. ఎలా ఆగిపోయినా పెళ్లి అయితే ఆగిపోతుంది. కానీ.. అసలు ఎంగేజ్‌మెంట్ పూర్తయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవచ్చా? అలా చేసుకుంటే చట్టం ఒప్పుకుంటుందా? కేసు వేస్తారా? అంటూ పలు ప్రశ్నలు కొందరిని వేధిస్తుంటాయి. దానికి సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ కథనం.
మన దేశ న్యాయ వ్యవస్థలో ప్రతి విషయానికి ఒక చట్టం ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఒకటి ఉంటుంది. అది ఏం చెబుతుంది అంటే.. ఒక వ్యక్తికి నచ్చిన పని చేసుకునే హక్కు అన్నమాట. అది పెళ్లి కానీ.. మరేదైనా కానీ.. 18 ఏళ్లు నిండిన భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఆర్టికల్ 21 ప్రకారం వాళ్లకు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అంటే వాళ్లకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. కానీ.. ఆ పెళ్లి చేసుకోవద్దు అంటూ చెప్పే హక్కు ఎవ్వరికీ ఉండదు.
Relationship Law : కావాలని పెళ్లి ఆపితే అది నేరం
ఆర్టికల్ 21 ప్రకారం మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది కాబట్టి ఎంగేజ్ మెంట్ అయినా కూడా మీకు ఆ వ్యక్తి నచ్చకపోతే నిరభ్యంతరంగా ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలని మీ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేస్తే మాత్రం, పదిఒకవేళ కావాలని మీ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేస్తే మాత్రం, పది మంది ముందు పరువు తీయడం, కట్నం కోసం వేధించడం, కట్నం కోసం పెళ్లి ఆపడం లాంటివి చేస్తే మాత్రం వాళ్లపై సెక్షన్ 417, 420 కింద చీటింగ్ కేసు పెట్టొచ్చు.
ఎందుకంటే.. ఎంగేజ్ మెంట్ అయ్యాక కావాలని పెళ్లిని ఆపితే అది ఖచ్చితంగా మీకు డ్యామేజ్ అయినట్టే. అందుకే సివిల్ కేసు కూడా ఫైల్ చేసి వాళ్ల నుంచి మీకు అయిన డ్యామేజీకి, నష్టానికి పరిహారం కూడా తిరిగి పొందొచ్చు. ఒకవేళ మీకే ఆ వ్యక్తి నచ్చకపోతే మాత్రం సింపుల్ గా మీరు ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అది చట్టప్రకారం నేరం ఏమాత్రం కాదు.