Wife and Husband Relationship : పెళ్లి అనేది భార్యాభర్తల మధ్య బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. పెళ్లి తర్వాతనే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. భర్త లేదా భార్యకు పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అయితే.. ఈ సృష్టిలో ఏ బంధానికి కూడా విడాకులు లేవు కానీ.. భార్యాభర్తల మధ్య బంధానికి మాత్రం విడాకులు ఉన్నాయి. దానికి కారణం.. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం అటువంటిది. వాళ్లకు నచ్చినట్టుగా బతికే అవకాశం ఉంటుంది కానీ.. ఒకవేళ భార్యను పట్టించుకోకుండా.. భర్తను పట్టించుకోకుండా ఉండటం మాత్రం కొన్నిసార్లు సెట్ కాదు. ఎందుకంటే.. భార్య అయినా భర్త అయినా కొన్ని కోరికలు తమ పార్టనర్ తోనే తీర్చుకుంటారు. వాళ్లు కాకుండా వేరే ఆప్షన్ ఉండదు.
అటువంటి సమయాల్లో మీ భార్య కానీ.. భర్త కానీ శారీరకంగా మీకు సంతృప్తి ఇవ్వకపోతే ఏం చేస్తారు. శారీరకంగా కలుద్దామన్నా కూడా భార్య వినకపోతే.. భర్త వినకపోతే అప్పుడు ఏం చేస్తారు. మిమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చేస్తారు. ఎవడు గొడవ పెట్టుకుంటారు అని లైట్ తీసుకుంటారా? అలా ఎన్ని రోజులు లైట్ తీసుకుంటారు. అది కుదరని పని కదా. అందుకే ఆ పని విషయంలో భార్య లేదా భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు నిరభ్యంతరంగా విడాకులు తీసుకోవచ్చు.
Wife and Husband Relationship : ఏ సెక్షన్ కింద విడాకులు ఇస్తారు?
భార్య కానీ.. భర్త కానీ ఆ విషయంలో ఒప్పుకోకపోతే అది మెంటల్ క్రుయాలిటీ కిందికే వస్తుంది. అందుకే హిందు మ్యారేజ్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 13 వన్ ఐఏ కింద మీరు విడాకులు తీసుకోవచ్చు. కంటిన్యూగా మీ భార్య లేదా భర్త ఇబ్బంది పెడితే ఇక తప్పని సరి పరిస్థితుల్లో విడాకులు తీసుకోవచ్చు.
అయితే.. ఏదో ఒకసారి రెండుసార్లు వాళ్లు తిరస్కరిస్తే ఈ చట్టం కింద మీరు విడాకులు తీసుకోవడానికి ఉండదు. కంటిన్యూగా వాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, వాళ్ల ఇబ్బంది వల్ల మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయితే.. మీరు మెంటల్ గా బాధ అనుభవిస్తే ఇక మీరు వేచి చూడాల్సిన అవసరం లేదు. భార్య అయినా భర్త అయినా ఎవ్వరైనా సరే.. ఎవ్వరైనా ఇలా మిమ్మల్ని బాధపెడితే పైన చెప్పిన సెక్షన్ కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసి విడాకులు తీసుకోవచ్చు. కాకపోతే విడాకులు ఇచ్చే సమయంలో నిజంగానే మీ భార్య లేదా భర్త.. మిమ్మల్ని శారీరకంగా సంతృప్తి పరచలేదని కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది.