Health Insurance Policy : ఈరోజుల్లో ఇన్సురెన్స్ పాలసీలు చాలా ముఖ్యం. ఇన్సురెన్స్ లేకపోతే ఏం చేయలేం. లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బీమాలు అవి. కానీ.. చాలామంది డబ్బులు ఉండి, లేక అసలు ఇన్సురెన్స్ లే తీసుకోరు. ఆ తర్వాత చాలా బాధపడతారు. ఇన్సురెన్స్ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం డబ్బులు మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. సడెన్ గా ఏదైనా అయితే లక్షలకు లక్షలు అయితే ఎవ్వరూ ఏం చేయలేరు. అప్పు తెచ్చో లేక ఏదైనా ప్రాపర్టీ అమ్మి ఆ డబ్బును కట్టాల్సి ఉంటుంది.
మరికొందరు కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్సురెన్స్ ను తీసుకుంటారు. ఆ పాలసీ ఉంది కదా అని సైలెంట్ గా ఉండిపోతారు. కానీ.. కంపెనీలు ఇచ్చే హెల్త్ పాలసీల కవరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఏ కంపెనీ అయినా మినిమం రూ.2 లక్షల కవరేజ్ మాత్రమే ఇస్తుంది. ప్రీమియం ఎక్కువగా ఉంటే రూ.3 లక్షల వరకే ఉంటుంది. కానీ.. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఆసుపత్రి బిల్లు రూ.5 లక్షలు అయితే అందులో కవర్ అయ్యేది రూ.2 లక్షలు మాత్రమే. మరి.. మిగితా రూ.3 లక్షలు ఎవరు కట్టాలి. పేరుకు హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా బిల్లు మొత్తం కవర్ కాదు. అందుకే.. కంపెనీలలో పనిచేసే వాళ్లు కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సురెన్స్ ఉన్నా కూడా మరో పాలసీ తీసుకోవడం బెటర్.
Health Insurance Policy : మరో పాలసీ ఎక్కడ తీసుకుంటే బెటర్
ముందు కంపెనీ ఇచ్చిన పాలసీ ఎంత కవరేజ్ ఇస్తోంది. అది ఏ కంపెనీ పాలసీ అనే వివరాలు తెలుసుకొని వేరే హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకోవచ్చు. లేదా ఆ కంపెనీ ఇచ్చే పాలసీలోనే కవరేజ్ ను పెంచుకోవచ్చు. దాని వల్ల ప్రీమియం ధర పెరుగుతుంది. కానీ.. కవరేజ్ పెంచుతారు. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కంపెనీలో ఎక్కువ కవరేజ్ ఇచ్చే పాలసీలు లేకపోతే కంపెనీలో కాకుండా బయట మరో రెండు మూడు లక్షల కవరేజ్ ఇచ్చే పాలసీని తీసుకోవచ్చు.
మధ్యలో కంపెనీ మానేసినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కంపెనీలో ఇదివరకు ఉన్న పాలసీ వర్తించదు. అప్పుడు డబ్బులు మొత్తం మన చేతి నుంచే కట్టుకోవాల్సి వస్తుంది. అందుకే.. ఖచ్చితంగా హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ అనేది తీసుకోవాల్సిందే. జాబ్ చేస్తున్నంత సేపే కంపెనీలు ఇన్సురెన్స్ ను ఇస్తాయి. రిటైర్ అయిన వాళ్లకు కూడా కంపెనీల పాలసీ వర్తించదు. అటువంటి వాళ్లు సపరేట్ గా హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
అయితే.. ఎంత కవరేజ్ కి ప్రీమియం తీసుకోవాలి అనే దానిపై చాలామందికి క్లారిటీ ఉండదు. మీకు సంవత్సర ఆదాయం ఎంత ఉందో.. దాంట్లో కనీసం 50 శాతం కవర్ అయ్యేలా ప్రీమియం తీసుకోండి. సరిపోతుంది.