Second Marriage : రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? రెండో పెళ్లి అనేది మన దేశంలో లీగలా? ఇల్లీగలా? అనేది చాలామందికి తెలియదు. అయితే.. రెండో పెళ్లి ఎవరైనా చేసుకోవచ్చు కానీ.. ఈ మూడు కారణాలు మీదగ్గర ఉండాలి. అప్పుడే మీరు రెండో పెళ్లికి అర్హులు. అవేంటో తెలుసుకుందాం రండి.
మీరు రెండో పెళ్లి చేసుకోవాలని కనుక అనుకుంటే మీ భర్త కానీ.. మీ భార్య కానీ చనిపోయి ఉండాలి. అప్పుడు మీరు నిరభ్యంతరంగా రెండో పెళ్లి చేసుకోవచ్చు. అది చట్టప్రకారమే అవుతుంది. లీగల్ అవుతుంది. మీ భార్య కానీ భర్త కానీ చనిపోకుండా ఉన్నా కూడా మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హులు కారు.
మీ భర్తకు కానీ భార్యకు కానీ విడాకులు ఇచ్చి ఉన్నా కూడా మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హులే. ఒకవేళ మీ భర్త, భార్య బతికే ఉండి.. వాళ్లకు విడాకులు ఇవ్వకుండా ఉంటే మాత్రం మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హులు కారు.
Second Marriage : మీ భార్య లేదా భర్త మిస్సింగ్ అయినా రెండో పెళ్లి చేసుకోవచ్చు
మీ భర్త లేదా భార్య ఒకవేళ మిస్ అయితే కనిపించకుండా పోతే అప్పుడు రెండో పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే వాళ్లు మిస్ అయి కనీసం ఏడేళ్లు కావాలి. కనీసం ఏడేళ్లు వాళ్లు కనిపించకుండా మిస్ అయి ఉంటే అప్పుడు రెండో పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే ఏడేళ్ల తర్వాత కూడా వాళ్లు కనిపించే స్కోప్ లేకపోతేనే మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హులు అవుతారు.
అయితే.. మీ భార్య లేదా భర్త మిస్ అయితే మీరు వెంటనే పోలీస్ ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది. పోలీస్ ఫిర్యాదు ఇచ్చి కూడా కనీసం ఏడేళ్లు కావాలి. పోలీస్ వాళ్లు కూడా వాళ్ల కోసం వెతికి ఇక లాభం లేదు.. దొరకరు అని కన్ఫమ్ చేసుకున్నాక అప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు.
ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ మూడు కారణాల్లో కనీసం ఏదైనా ఒక కారణం ఖచ్చితంగా ఉండాలి. అలా కాదని మీరు పెళ్లి చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా నేరమే అవుతుంది. మీ భార్య లేక భర్త బతికి ఉన్నా కూడా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం అది ఐపీసీ సెక్షన్ 494 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అందుకే రెండో పెళ్లి విషయంలో అస్సలు తొందరపడకండి.