No Lunch Time in Banks : అదేంటి బ్యాంకులో పని చేసే వాళ్లకు లంచ్ టైమ్ ఉండదా? మరి.. వాళ్లు లంచ్ ఎలా చేస్తారు. వాళ్లు మధ్యాహ్నం భోజనం చేయరా? బ్యాంకు 4 గంటలకు అయిపోయాక భోం చేస్తారా అని అడగకండి. ఎందుకంటే.. బ్యాంకులు ఒక రోజులో వర్క్ చేసేదే 6 గంటలు. 10 గంటలకు బ్యాంక్ తీస్తే సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకును క్లోజ్ చేసేస్తారు. 4 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కూడా బ్యాంకులో పని జరగదు. చాలా తక్కువ సమయమే ఉంటుంది కాబట్టి జనాలు ఎక్కువగా ఉంటే వెళ్లిన పని త్వరగా కాదు.
అందులో లంచ్ టైమ్ కే అర్ధగంట లేదా కొన్ని బ్యాంకులు గంట సమయం తీసుకుంటాయి. గంట సమయం పోతే ఇక మిగిలేది 5 గంటలే. ఆ ఐదు గంటల్లోనే వచ్చే కస్టమర్లకు అందరి పనులు చేయాలంటే బ్యాంకు సిబ్బందికి ఒక్కోసారి కుదరదు. అందుకే బ్యాంకుల్లో లంచ్ టైమ్ అనేది ఉండదు. అంటే.. దాని అర్థం అసలు లంచ్ టైమ్ ఉండదని కాదు. స్పెసిఫిక్ టైమ్ లో లంచ్ కోసం అందరు సిబ్బంది ఒకేసారి వెళ్లకూడదు. రొటేషనల్ టైమ్ లో ఒకరి తర్వాత మరొకరు వెళ్లి లంచ్ చేయాల్సి ఉంటుంది.
No Lunch Time in Banks : లంచ్ సమయం అని చెప్పి తర్వాత రమ్మని చెబితే ఇలా ఫిర్యాదు చేయండి
రొటేషనల్ టైమ్ లో సిబ్బంది లంచ్ చేస్తే ఎవరో ఒకరు సీటులో ఉంటారు కాబట్టి ఆ సమయంలో బ్యాంకుకు వచ్చే కస్టమర్ల పని కూడా అయిపోతుంది. అందరూ ఒకేసారి లంచ్ కి వెళ్తే.. లంచ్ నుంచి వాళ్లు వచ్చే దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్తే ఇది లంచ్ టైమ్. కాసేపు ఆగి రండి. ఒక అరగంట తర్వాత రండి అని బ్యాంకు సిబ్బంది అంటే మాత్రం మీరు వెంటనే ఆ బ్యాంకు పైన 14440 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకులకు ఫిక్స్డ్ లంచ్ టైమ్ ఉండదు. కౌంటర్ దగ్గర ఎవరైనా ఒక సిబ్బంది కస్టమర్ల పనులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి మీరు చెప్పిన పని చేయకపోతే తర్వాత రమ్మంటే వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆ సిబ్బంది మీద, బ్యాంకు మీద ఫిర్యాదు చేయొచ్చు.