PM SYM : అవును.. మీరు నెలకు రూ.200 పే చేస్తే చాలు.. సంవత్సరానికి మీకు 72 వేలు వస్తాయి.. అలా ఎలా అంటారా? అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్దన్ యోజన స్కీమ్ వల్ల. ఇది భార్యాభర్తలు ఇద్దరికీ వర్తించే స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా కేవలం నెలకు 200 రూపాయల వరకు కట్టినా కూడా సంవత్సరానికి 72 వేల వరకు వస్తాయి. మరి ఈ పథకం కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు చెప్పండి అంటారా? పదండి వివరంగా తెలుసుకుందాం.
మీరు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కూడా పే చేయొచ్చు. మీ వయసును బట్టి ఉంటుంది. భార్యాభర్తలు కలిసి కూడా ఈ స్కీమ్ లో డబ్బులు పే చేయొచ్చు. ఉదాహరణకు మీరు రూ.200 పే చేశారు అనుకోండి నెలకు. మీకు 60 ఏళ్లు వచ్చాక.. నెలకు కేంద్ర ప్రభుత్వం మీకు రూ.3000 వేలు ఇస్తుంది. మీరు, మీ భార్య లేదా భర్త.. ఇద్దరూ కలిసి నెలకు రూ.200 పే చేస్తే.. మీకు 60 ఏళ్లు వచ్చాక మీకు, మీ భార్య లేదా భర్త ఇద్దరికీ కలిసి నెలకు రూ.6000 ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే.. సంవత్సరానికి రూ.72 వేలు అన్నమాట.
PM SYM : ఈ స్కీమ్ కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలి
ఒక్కసారి మీకు 60 ఏళ్లు వచ్చాయంటే నెల నెలా డబ్బులు మీ అకౌంట్ లో వేస్తారు. వాళ్లు చనిపోయే వరకు నెలకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున డబ్బులు అకౌంట్ లో వేస్తారు. అయితే.. ఈ స్కీమ్ కింద అర్హత పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్పీఎస్ స్కీమ్ లో చేరి ఉండకూడదు. ఎన్పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమే. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు చేరని వాళ్లే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్దన్ యోజన్ స్కీమ్ కింద అర్హులు అవుతారు.
అలాగే.. ప్రభుత్వానికి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్లు కూడా అనర్హులు. పీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్లు కూడా అర్హులు కాదు. ఇవేవీ లేకపోతే వెంటనే ఆ స్కీమ్ కి సంబంధించిన వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. నెలకు రూ.200 మాత్రమే కడితే చాలు. మీకు 60 ఏళ్లు వచ్చాక నెలకు రూ.3000 మీరు బతికున్నంత వరకు ఇస్తారు. 60 ఏళ్ల వయసు తర్వాత పనిచేయలేం కాబట్టి ఆ డబ్బు ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుంది.