PMEGP : చాలామంది దగ్గర బిజినెస్ ఐడియాలు ఉంటాయి కానీ వాటిని ఎలా అమలు చేయాలో.. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియదు. ఎందుకంటే బిజినెస్ ఐడియాలు చాలామందికి వస్తాయి. కానీ.. అందులో వాటిని అమలు చేసేది ఎంతమంది. ఏ బిజినెస్ ఐడియాను కార్యరూపంలోకి తీసుకురావాలంటే దానికి కావాల్సింది డబ్బు. దాన్నే వ్యాపార భాషలో పెట్టుబడి అంటాం. ఆ పెట్టుబడి లేకనే చాలామంది వెనకడుగు వేస్తుంటారు. కానీ.. అలాంటి వాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది.
అదే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మీ దగ్గర బిజినెస్ ఐడియా ఉన్నా.. బిజినెస్ ఐడియా లేకున్నా కూడా ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో మీకు బిజినెస్ ఐడియా నుంచి దానికి కావాల్సిన మిషనరీ, స్కిల్ ఉన్న ఉద్యోగులు అన్ని విషయాలు ఇందులో పొందుపరుస్తారు. పీఎంఈజీపీ అని గూగుల్ లో సెర్చ్ చేస్తే వెబ్ సైట్ డిటెయిల్స్ వస్తాయి. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
PMEGP : ఎంత వరకు పెట్టుబడి ఇస్తారు?
మీ వ్యాపారాన్ని బట్టి రూ.25 లక్షల వరకు మీకు పెట్టుబడి సాయం చేస్తారు. అది లోన్ రూపంలో ఇస్తారు. ప్రతి నెల ఈఎంఐలా పే చేసుకోవచ్చు. అందులో మీకు సబ్సిడీ కూడా ఉంటుంది. అందుకే మీ దగ్గర బిజినెస్ ఐడియా ఉంటే.. ఆ ఐడియా గురించి వివరాలు అన్నీ అందులో పొందుపరిచి మీ ఐడియాను బిజినెస్ గా మార్చడం కోసం ఎంత పెట్టుబడి కావాలి… మెషినరీ ఏమైనా కావాలా? స్కిల్ ఉన్న ఉద్యోగులు ఎవరైనా కావాలా? అన్ని వివరాలు అందులో ఇస్తే మీకు ఎంత అమౌంట్ పెట్టుబడిగా వస్తుందో ఆ వెబ్ సైట్ లో చూపిస్తారు.
ఒకవేళ మీ దగ్గర ఎలాంటి ఐడియా లేకపోతే ఆ వెబ్ సైట్ లో చాలా బిజినెస్ ఐడియాలు ఉంటాయి. ఆ బిజినెస్ ఐడియాలలో మీకు నచ్చిన బిజినెస్ ను చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. పెట్టుబడి కూడా వాళ్లే ఇస్తారు కాబట్టి.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి. వెంటనే బిజినెస్ మ్యాన్ అయిపోండి. జాబ్స్ కోసం టైమ్ వేస్ట్ చేసుకునే వారు, ఏ పని లేకుండా ఖాళీగా ఉండే యూత్ కి ఇది బెస్ట్ ఆప్షన్. యూత్ జాబ్ క్రియేట్ చేసేలా వాళ్లను ప్రోత్సహించడం కోసం కేంద్రం తీసుకొచ్చిన స్కీమ్ ఇది.