Syrups : ఈరోజుల్లో సిరప్స్ వేయడం అనేవి కామన్. ముఖ్యంగా పిల్లలకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు చేసినా సిరప్స్ వేస్తుంటాం. కానీ.. నిజంగానే ఆ సిరప్స్ మంచివేనా? కావా.. అనేది చాలామందికి తెలియదు. డాక్టర్లు రాసి ఇచ్చే సిరప్స్ అయితే మంచివే కానీ.. ఆ సిరప్స్ ను ఎలా వాడాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే.. సిరప్స్ వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు తాగిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిరప్స్ తాగించేటప్పుడు ఈ విషయాలు ఖచ్చతంగా తెలుసుకోవాలి. లేకపోతే పిల్లల ప్రాణాలకే ప్రమాదం జరిగే చాన్స్ ఉంటుంది. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
కొన్ని సిరప్స్ ఎలా ఉంటాయంటే.. పౌడర్, స్టెరైల్ వాటర్ వేర్వేరుగా వస్తాయి. ఆ వాటర్ ను పౌడర్ లో కలపాల్సి ఉంటుంది. అలా.. ఏ సిరప్ అయినా మిక్స్ చేసినప్పుడు దాని 10 రోజుల్లో వాడేయాలని. ఒకవేళ దాన్ని పది రోజుల్లో వాడకపోతే.. 10 రోజులు దాటాక దాన్ని పడేయాలి. దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. 10 రోజుల్లో పిల్లలకు దాన్ని వాడితే ఓకే. లేకపోతే దాన్ని పడేయండి. కానీ.. చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే.. ఒకసారి జ్వరం సిరప్ తీసుకుంటే.. దాన్ని ఒక రెండు రోజులు వాడుతారు. ఓ రెండు రోజుల పాటు పిల్లలకు తాగించిన తర్వాత పిల్లలకు తగ్గగానే.. ఆ సిరప్ ను దాచేస్తారు.
Syrups : ఒకసారి వాడిన సిరప్ ను మళ్లీ వాడకండి
పిల్లలకు మళ్లీ ఎప్పుడైనా జ్వరమో లేక దగ్గు, జలబు లాంటివి అయితే వెంటనే వాడిన పాత సిరప్ నే వాడుతుంటారు. కొత్తవి కొనరు. పాతవే వాడుతారు. కానీ.. అది కరెక్ట్ కాదు. అలా వాడటం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక సిరప్ ను ఓపెన్ చేశాక దానికి పది రోజుల వరకు మాత్రమే లైఫ్ టైమ్ ఉంటుంది.
ఒక్కసారి స్టెర్లైన్ వాటర్ ని పౌడర్ కలిపాక దాన్ని 10 రోజుల్లో వాడేయాలి. లేకపోతే అది మళ్లీ వాడటానికి పనికిరాదు. ఎక్కువగా యాంటీ బయాటిక్స్ కోసం ఇలాంటి సిరప్స్ ఇస్తుంటారు. ఒకవేళ సిరప్స్ డైరెక్ట్ గా ఎలాంటి స్టెర్లైన్ వాటర్ కలపకున్నా కూడా ఒక్కసారి సిరప్ ను ఓపెన్ చేస్తే ఇక దాన్ని మరోసారి అస్సలు వాడకూడదు. అలా చేస్తే పిల్లలకు లేని పోని ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. దాని వల్ల ఉన్న సమస్య కాదు.. లేనిపోని సమస్యలు వస్తాయి. లేనిపోని ఇన్ఫెక్షన్లు వస్తాయి.