TS Agro Karshak Petrol Bunk : మీరు ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? కానీ.. మీ దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేదా? అయినా నో టెన్షన్. రూపాయి ఖర్చు పెట్టకుండా.. రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఫ్రీగా పెట్రోల్ బంక్ పెట్టుకోవచ్చు. ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తుంది. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే టీఎస్ స్టేట్ ఆగ్రో కర్షక్ పెట్రోల్ పంప్. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు ఉచితంగా పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని కోసం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
దాని కంటే ముందు ఏదైనా రద్దీ ప్లేస్ లో ఒక లాండ్ ఉండాలి. అంటే మెయిన్ రోడ్ కి దగ్గర్లో ఒక అర ఎకరం, లేదా ఎకరం.. అంటే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే ప్లేస్ ను మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరు ఈ స్కీమ్ కింద పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి అర్హులు అవుతారు. దాని కోసం మీరు చేయాల్సింది ఒక్కటే. టీఎస్ అగ్రో కర్షక్ పెట్రోల్ బంక్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు మీరు స్థలం చూసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ తరహా పెట్రోల్ బంక్ లు ఏర్పాటు చేశారు. వాటికి అగ్రోస్ కర్షక్ పెట్రోల్ బంక్ లు అని పిలుస్తారు.
TS Agro Karshak Petrol Bunk : నిరుద్యోగులకు ఇది బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు
నిరుద్యోగులకు ఇది బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగం చేయడం ఆసక్తి లేక.. బిజినెస్ చేయాలనుకుంటే.. వాళ్లకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది. స్థలం ఉందని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు స్థలాన్ని పరిశీలించి.. పెట్రోల్ బంక్ కి పర్మిషన్ ఇస్తారు. పంపు నిర్వహణ మొత్తం అగ్రో సంస్థ చూసుకుంటుంది. లాభాల్లో 75 శాతం పెట్రోల్ బంక్ పెట్టిన వాళ్లకు ఇచ్చి 25 శాతం అగ్రో సంస్థ తీసుకుంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ నిరుద్యోగులు పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని కోసం స్థలం ఉంటే చాలు. పెట్టుబడి మొత్తం అగ్రో సంస్థ పెడుతుంది. కాకపోతే పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కావాల్సినవన్నీ లబ్ధిదారులే చూసుకోవాలి. ఆ తర్వాత పంప్ నిర్వహణ కూడా అగ్రో సంస్థే చూసుకుంటుంది. కాకపోతే లబ్ధిదారులు పంప్ మెయిన్ టెనెన్స్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే చాలు.