Bus Pass Renewal : బస్ పాస్ కోసం గంటలకు గంటలు క్యూలో నిలబడతారు. ముఖ్యంగా స్టూడెంట్ బస్ పాస్ ల కోసం గంటలకు గంటలు కాలేజీ, స్కూళ్లు ఎగ్గొట్టి మరీ బస్ పాస్ కౌంటర్ ముందు నిలబడాలి. చాలా ఏళ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. నెలకు ఒకసారి ఇదే పని. నెలలో ఒక రోజు బస్ పాస్ కౌంటర్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. కానీ.. ఇక నుంచి అలాంటి సమస్య లేదు. మీ ఇంట్లో కూర్చొని కూడా మీరు మీ బస్ పాస్ ను రెన్యువల్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే.. ఆన్ లైన్ లో మీ బస్ పాస్ ను రెన్యువల్ చేసుకునే అవకాశం వచ్చింది.
టీఎస్ఆర్టీసీ కొత్తగా ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అది స్టూడెంట్ బస్ పాస్ కానీ.. జనరల్ బస్ పాస్ కానీ.. ఇంకేదైనా పాస్ కానీ.. ఏ పాస్ అయినా సరే ఆన్ లైన్ లో రెన్యువల్ చేసుకోవచ్చు. కొత్తగా తీసుకునే వాళ్లు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొని ఆన్ లైన్ లో ఫీ పే చేసి బస్ పాస్ కౌంటర్ కు వెళ్లి అయినా పాస్ ను ప్రింట్ తీసుకోవచ్చు.
Bus Pass Renewal : ఆన్ లైన్ లో ఎలా బస్ పాస్ రెన్యువల్ చేసుకోవాలి
ఆన్ లైన్ లో బస్ పాస్ ను రెన్యువల్ చేసుకోవాలని అనుకునేవాళ్లు.. online.tsrtcpass.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ బస్ పాస్ ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్ సైట్ ఓపెన్ చేశాక.. హైదరాబాద్ సిటీ, గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కన జిల్లాల పాస్ ల కోసం ఒక బటన్ ఉంటుంది.
ఇతర జిల్లాల పాస్ ల రెన్యువల్ కోసం మరో బటన్ ఉంటుంది. స్టూడెంట్స్ పాస్ అయినా.. జనరల్ పాస్, ఎన్జీవో పాస్ ఏదైనా సరే.. ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడున్న ఆప్షన్ల ప్రకారం రెన్యువల్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ఆ అప్లయి అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లేదా రెన్యువల్ కోసం ఆప్షన్లు కనిపిస్తాయి. కొత్త పాస్ అయితే వివరాలన్నీ ఇచ్చి ఆన్ లైన్ లో పేమెంట్ చేయొచ్చు. వెంటనే పాస్ వచ్చేస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవడమే. కౌంటర్ల వద్దకు వెళ్లి గంటలకు గంటలు నిలబడకుండా ఆన్ లైన్ విధానాన్ని టీఎస్ఆర్టీసీ తాజాగా తీసుకొచ్చింది.