Airport Unlimited Meals : మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నారనుకోండి. అక్కడికి వెళ్లాక ఫుడ్ విషయంలో చాలా సమస్య వస్తుంది. ఎక్కడ తినాలో తెలియదు. ఏ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంటుందో తెలియదు. అసలు మనం తినే ఫుడ్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అందుకే చాలామంది ముందే ఫుడ్ ను తమతో పాటే తీసుకెళ్తుంటారు. లేదా కొందరు ఫ్రూట్స్ తిని ఉంటారు. అయితే.. బయట రెస్టారెంట్స్ చాలానే ఉంటాయి కానీ.. ఒక్కోసారి అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. అదే ఎయిర్ పోర్ట్ లో అయితే అలాంటి సమస్య ఉండదు. మీకు కావాల్సినంత ఫుడ్ 2 రూపాయలకే తినేయొచ్చు. ఇది ఏ ఒక్క ఎయిర్ పోర్ట్ లో కాదు.. మన దేశంలో ఉన్న అన్ని ఎయిర్ పోర్టుల్లో ఉండే లాంజ్ లలో అందుబాటులో ఉంటుంది.
మీరు ఏ ఎయిర్ పోర్ట్ కు వెళ్లినా.. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక చెక్ ఇన్ అయ్యాక మీకు అక్కడ లాంజ్ కనిపిస్తుంది. అక్కడికెళ్లి 2 రూపాయలు పే చేసి అక్కడ ఉన్న ఫుడ్ మొత్తం లాగించేయొచ్చు. దాని కోసం మీరు ఎక్స్ట్రాగా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటే చాలు. 2 రూపాయలతో ఎయిర్ పోర్ట్ లో అన్ లిమిటెడ్ ఫుడ్ తినవచ్చు. అది కూడా నాన్ వెజ్ ఫుడ్. కొన్ని బ్యాంకులు ఎయిర్ పోర్టుల్లో ఉండే లాంజెస్ తో టైఅప్ అవుతాయి. అందుకే మనం సింపుల్ గా ఆ బ్యాంకుల క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్లి అక్కడ లాంజ్ లో ఇస్తే.. మన క్రెడిట్ కార్డు నుంచి 2 రూపాయలు కట్ చేసుకొని లోపలికి పంపిస్తారు. అంతే.. లోపల రెచ్చిపోవడమే. నచ్చిన ఫుడ్ ఐటెమ్ ఎంతైనా తినవచ్చు.
Airport Unlimited Meals : ఒకవేళ క్రెడిట్ కార్డు లేకపోతే ఏం చేయాలి?
ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి క్రెడిట్ కార్డు లేకపోతే డ్రీమ్ ఫోల్క్స్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇచ్చి 2 రూపాయలు పే చేసి ఎయిర్ పోర్టు, లాంజ్ ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ను లాంజ్ లో చూపిస్తే లోపలికి పంపిస్తారు. ఇక.. లోపలికి వెళ్లి కుమ్ముడే. ఎంత ఫుడ్ అంటే అంత ఫుడ్.. ఫ్లైట్ టైమ్ అయ్యేదాక అక్కడే స్పెండ్ చేయొచ్చు. ఫుల్ గా మెక్కేయొచ్చు. వెజ్, నాన్ వెజ్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎంత తినగలిగితే అంత తినవచ్చు.