Driving Licence : టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. దాని వల్ల వాళ్ల డ్రైవింగ్ లైసెన్స్ అసలు పనికిరాకుండా పోతుంది. ఇంతకీ వాళ్లు చేసే మిస్టేక్ ఏంటి అంటారా? అసలు చాలామందికి టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లో రెండు రకాల లైసెన్సులు ఉంటాయని తెలియదు. అందులో ఒకటి ఎంసీడబ్ల్యూఓజీ, ఎంసీడబ్ల్యూజీ. ఈ రెండింటికి తేడా తెలియక చాలామంది MCWOG లైసెన్స్ తీసుకుంటూ ఉంటారు. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడే MCWG కి దరఖాస్తు చేసుకోవాలి. MCWOG కి కాదు. ఎంసీడబ్ల్యూజీ అంటే మోటార్ సైకిల్ విత్ అవుట్ గేర్ అని అర్థం.
ఈ లైసెన్స్ తీసుకుంటే గేర్లు లేని స్కూటీలు మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది. గేర్లు ఉన్న బైక్స్ నడిపకూడదు. ఎంసీడబ్ల్యూజీ అంటే మోటార్ సైకిల్ విత్ గేర్ అన్నమాట. 50 సీసీ కంటే తక్కువ సీసీ ఉన్న వాహనాలు నడిపేందుకు ఇచ్చే లైసెన్సే ఎంసీడబ్ల్యూఓజీ. వాటి గరిష్ఠ వేగం కూడా 45 కిలోమీటర్లకు మించదు. ఎలక్ట్రికల్ వాహనాలు అయితే 0.5 కిలో వాట్స్ కంటే తక్కువ సీసీ ఉంటుంది. యాక్టివా కానీ.. జుపిటర్ కానీ.. స్కూటీ కానీ.. ఇలాంటి వాహనాలు ఎంసీడబ్ల్యూఓజీ కిందికి వస్తాయి. అయినా కూడా మీరు విత్ అవుట్ గేర్ లైసెన్స్ కాకుండా విత్ గేర్ లైసెన్స్ తీసుకుంటే మంచిది.
Driving Licence : ఎంసీడబ్ల్యూజీ అంటే ఏంటి?
ఎంసీడబ్ల్యూజీ అంటే మోటార్ సైకిల్ విత్ గేర్ అన్నమాట. అంటే గేర్ ఉన్న ప్రతి వాహనానికి ఈ లైసెన్స్ ఉపయోగపడుతుంది. హోండా షైన్, బజాబ్ పల్సర్, హీరో ప్యాషన్ లాంటి వాహనాలు నడిపే వాళ్లు ఈ లైసెన్స్ తీసుకోవాలి. అయితే.. ఈ లైసెన్స్ ఉంటే స్కూటీలు కూడా నడపొచ్చు.
ఒకవేళ ఎంసీడబ్ల్యూఓజీ లైసెన్స్ లేకున్నా.. ఎంసీడబ్ల్యూజీ లైసెన్స్ ఉంటే చాలు. మీ వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా మీకు ఎంసీడబ్ల్యూజీ లైసెన్స్ ఉంటే ఇన్సురెన్స్ వస్తుంది. లేకపోతే రాదు. అందుకే.. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వాళ్లు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ముందే, అంటే లర్నర్ లైసెన్స్ తీసుకునే ముందే ఖచ్చితంగా మీరు ఫామ్ నింపేటప్పుడు ఎంసీడబ్ల్యూజీ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఒకవేళ మీకు తెలియకుండా ఎంసీడబ్ల్యూఓజీ లైసెన్స్ తీసుకుంటే.. దాన్ని మీరు ఎంసీడబ్ల్యూజీకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. దాని కోసం మీరు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత స్లాట్ డేట్ ప్రకారం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి దాన్ని మార్పించుకోవచ్చు.