Money on Road : చాలామందికి రోడ్ల మీద డబ్బులు దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా పడేసుకున్నా.. పర్సుల నుంచి చేజార్చుకున్నా అవి రోడ్ల మీద పడతాయి. ఎవరికో ఒకరికి కనిపిస్తాయి. ఎవరికైనా డబ్బులు కనిపించగానే అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడటం లేదు కదా అనుకొని టక్కున జేబులో పెట్టుకుంటారు. అబ్బ.. రోడ్డు మీద డబ్బులు కనిపించగానే ఎగిరి గంతేస్తారు. ఫ్రీగా వచ్చాయి కదా అని డబ్బులు జేబులో వేసుకుంటారు.
అసలు వేరే వాళ్ల డబ్బులు కనిపిస్తే తీసుకోవడం కరెక్టేనా? వాటిని మన డబ్బులుగా అనుకొని ఖర్చు పెట్టడం ఎంత వరకు కరెక్ట్. వాటిని అలా ఖర్చు పెడితే మనకు ఏమైనా అవుతుందా? అనేది చాలామందికి తెలియదు. కానీ.. కొందరు మాత్రం తమకు డబ్బులు దొరికితే వాటిని ఎవరైనా పేదలకు, అడుక్కునే వాళ్లకు ఇస్తారు. కానీ.. డబ్బులు దొరికితే ముందు ఆ డబ్బులను పోగొట్టుకున్న వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. వాళ్లు అక్కడుంటే ఓకే. ఎవరితోనైనా సంప్రదించి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని.
Money on Road : దానం చేసినా? దేవాలయాల హుండీలో వేసినా ఓకే
నిజానికి.. ఎవరిదైనా డబ్బు మనకు రోడ్డు మీద దొరికితే అది మంచి శకునమేనట. వాస్తు ప్రకారం అది శుభ పరిణామమేనట. దానిని మన దగ్గరే ఉంచుకున్నా మంచిదేనట. లేదంటే.. ఆ డబ్బును ఎవరికైనా దానం చేయొచ్చట. లేదా దేవాలయాల్లో వేయడం బెస్ట్ అంటున్నారు. మీకు త్వరలో మంచి కాబోతోంది. అందుకే మీకు డబ్బు దొరికింది అనే శుభ సూచికం అట. ఆర్థిక ప్రయోజనాలు పొందబోతున్నామని అర్థం. త్వరలో విజయం సాధిస్తారు అని పండితులు చెబుతున్నారు.
అదృష్టానికి సంకేతంగా డబ్బులు దొరకడాన్ని భావించాలి. అంతే కానీ.. రోడ్డు మీద డబ్బులు ఎవరివో.. వాటిని తీసుకుంటే ఏమౌతుందో అని సందేహించాల్సిన అవసరం లేదట. ఏంచక్కా వాటిని తమ వెంట తీసుకెళ్లొచ్చు అంటున్నారు పండితులు. ఇంకెందుకు ఆలస్యం.. ఇంకోసారి ఎప్పుడైనా మీకు డబ్బులు దొరికితే వెంటనే మీ జేబులో వేసేసుకోండి. అది కూడా ఆ డబ్బు ఎవరిదో తెలియకపోతే. ఆ డబ్బు ఎవరిదో తెలిస్తే మాత్రం వెంటనే వాళ్లది వాళ్లకు ఇచ్చేయండి.