Fixed Deposits : మీరు ఏదైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నారా? దాన్ని మధ్యలోనే బ్రేక్ చేద్దామని అనుకుంటున్నారా? మధ్యలో డబ్బులు అవసరం ఉండి ఎఫ్డీని బ్రేక్ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే మీకు తెలియని ఒక విషయం ఏంటంటే.. ఎఫ్డీని మధ్యలోనే బ్రేక్ చేస్తే మీరు చాలా నష్టపోతారు. మీకు వచ్చే వడ్డీ మీద బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. ఎఫ్డీ మెచ్యూరిటీ కాకముందే మధ్యలో ఎఫ్డీని బ్రేక్ చేస్తే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు గుర్తొచ్చేది వడ్డీ. మన దగ్గర ఉన్న అవసరం లేని డబ్బును తీసుకెళ్లి ఏదైనా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. దాని వల్ల పెద్దగా వడ్డీ రాదు. అందుకే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఎన్ని ఎక్కువ సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అంత ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలామంది రెండు మూడేళ్లకు ఎఫ్డీ చేస్తుంటారు కానీ.. ఆ తర్వాత ఎఫ్డీని మధ్యలోనే బ్రేక్ చేస్తుంటారు. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే.. ఎఫ్డీని బ్రేక్ చేస్తారు. కానీ.. అలా చేయకూడదు. దాని వల్ల మీకే లాస్. ఎలాగో తెలుసుకోండి.
Fixed Deposits : ఎప్పుడూ ఎఫ్డీని మధ్యలో బ్రేక్ చేయకండి
ఏ బ్యాంకులో అయినా ఎఫ్డీ పెడితే అది మెచ్యూర్ అయ్యేదాకా ఖచ్చితంగా ఉంచాలి. మరీ అత్యవసరం అయితే తప్ప బ్రేక్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బ్రేక్ చేయాలంటే మాత్రం ఇక చేసేదేం ఉండదు. కానీ.. దాని వల్ల మీరు ఎంత నష్టపోతారో తెలుసుకోండి.
సాధారణంగా 3 సంవత్సరాలకు వడ్డీ 5.5 శాతం ఉంటే.. మధ్యలో బ్రేక్ చేస్తే వడ్డీపై పెనాల్టీ వేస్తారు. అది 1 శాతం ఉంటుంది. అంటే 4.5 శాతం మాత్రమే వడ్డీ ఇస్తారు. అలా చూస్తే వడ్డీ చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు మీరు 5 లక్షలు 3 సంవత్సరాలకు ఎఫ్డీ చేస్తే మధ్యలోనే బ్రేక్ చేస్తే రూ.16 వేల వడ్డీ తగ్గుతుంది.
ఒకవేళ మీరు ఆటో స్వీప్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే ఎఫ్డీ చేసిన డబ్బులో కొంత డబ్బును విత్ డ్రా చేసుకొని మిగితా డబ్బును అలాగే ఉంచుకోవచ్చు. తీసిన డబ్బు మీద ఎలాంటి పెనాల్టీ ఉండదు. విత్ డ్రా చేసిన డబ్బు కాక మిగిలిన డబ్బు మీద వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే అలా చేయాలంటే ఆటో స్వీప్ ఆప్షన్ ను ముందే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.