Train Derailing : ప్రస్తుతం దేశమంతా ఒకటే టాపిక్. అదే ఒడిశా రైళ్ల ప్రమాదం. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రైళ్లు ఒకదాన్ని మరోటి ఢీకొని పెను విధ్వంసం సృష్టించాయ. 300 మంది వరకు ఈ ప్రమాదంలో చనిపోగా.. వేల మంది క్షతగాత్రులయ్యారు. అసలు ఒడిశా రైళ్ల ప్రమాదం ఎలా జరిగింది అనేది పక్కన పెడదాం. కానీ.. అసలు రైళ్లు ఎందుకు పట్టాలు తప్పుతాయి. రైళ్లు పట్టాలు తప్పితే ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతుందా? ఇంత ప్రమాదం జరుగుతుందని తెలిసి రైల్వే అధికారులు ఎందుకు పట్టాలు తప్పకుండా రైళ్లను అడ్డుకోలేకపోతున్నారు అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి.
మన దేశంలో హై స్పీడ్ రైళ్ల గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. దానికి అనుగుణంగానే ట్రాక్స్ ను కూడా అప్ గ్రేడ్ చేస్తుంటారు. వందే భారత్ లాంటి ట్రెయిన్స్ 300 స్పీడ్ తో వెళ్తుంటాయి. అటువంటి రైళ్లు నడిచేలా.. వాటికి అనుగుణంగా ట్రాక్స్ ను సిద్ధం చేస్తుంటారు. అయినా కూడా కొన్నిసార్లు రైళ్లు పట్టాలు తప్పుతుంటాయి. ఇప్పటి వరకు జరిగిన రైళ్ల ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగింది రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే. తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం కూడా అటువంటిదే.
Train Derailing : అసలు రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలు ఏంటి?
ఒక రైలు పట్టాలు తప్పింది అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ట్రాక్ నిర్వహణ సరిగ్గా లేకపోయినా, కోచ్ లో ఏదైనా సమస్య ఉన్నా, లేదా డ్రైవింగ్ లో ఏవైనా మిస్టేక్స్ ఉన్న రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. ట్రాక్స్ లో పగుళ్లు ఉన్నా, ట్రాక్స్ అంత నాణ్యతగా లేకపోయినా.. ఒక్కోసారి రైలు దాని మీద ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ తట్టుకోలేదు. దాని వల్ల రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.
కొన్ని సార్లు రైళ్లలోనూ లోపాలు ఉంటాయి. అంటే.. ఇంజిన్, కోచ్ లలో సమస్యల కారణంగానూ పట్టాలు తప్పే చాన్స్ ఉంది. ఒక్కోసారి వాతావరణ మార్పుల వల్ల కూడా ట్రాక్స్ లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వేసవి కాలంలో ట్రాక్స్ ఎండ వేడి వల్ల వ్యాకోచిస్తాయి. అదే చలికాలంలో అయితే అవి సంకోచిస్తుంటాయి. అటువంటి సమయాల్లో ట్రాక్స్ నిర్వహణ అనేది ముఖ్యమైనది. అధికారలు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రైళ్లు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.