2000 Notes : రూ.2000 నోట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలుసు కదా. ఎందుకు బ్యాన్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవినీతి, అక్రమాలను, బ్లాక్ మనీని తగ్గించడం కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇదివరకు 1000, 500 నోట్లను బ్యాన్ చేసిన కేంద్రం.. ఆ తర్వాత కొత్త 500 నోట్లను తీసుకొచ్చింది. పాత 500 నోట్లు, 1000 నోట్లను బ్యాన్ చేసింది. ఆ తర్వాత కొత్తగా 500, 2000 నోట్లను ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది.
కానీ.. కొత్తగా వచ్చిన 2000 నోట్లతో చాలా చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ నోటుకు చాలామంది చిల్లర ఇవ్వకపోవడం, బ్లాక్ మనీగా దాచుకోవడంలో ఆ నోటునే ఎక్కువగా వాడుతుండటంతో కేంద్రం ఆ నోట్లను కూడా బ్యాన్ చేసింది. దీంతో 2000 నోట్లు ఉన్న ప్రజలు కాస్త భయపడ్డారు. కానీ.. వాటిని 30 సెప్టెంబర్ 2023 వరకు బ్యాంకులలో మార్చుకునే వెసులుబాటు ఉంది. అప్పటి వరకు కూడా అది చలామణిలో ఉంటుంది. దాని లావాదేవీలపై మాత్రం ఎలాంటి పరిమితులు విధించలేదు కేంద్రం.
2000 Notes : షాపులలో 2000 నోటు తీసుకుంటారా?
అయితే..2000 నోటు బ్యాన్ అనేసరికి చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇక ఎవ్వరూ తీసుకోరు. అది పనికిరాదు అనుకుంటున్నారు. షాపుల వాళ్లు కూడా భయపడి ఆ నోటును తీసుకోవడం మానేశారు. కానీ.. 2000 నోటు సెప్టెంబర్ 30 వరకు సర్క్యులేషన్ లో ఉంటాయి. కాబట్టి షాపుల వాళ్లు కూడా తీసుకోవచ్చు. తర్వాత బ్యాంకుకు వెళ్లి వాటిని డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్ని నోట్లు ఉన్నా బ్యాంకు వాళ్లు తీసుకుంటారు.
మే 3, 2023 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు 2000 నోట్లను ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజానికి 2019 లోనే 2000 నోట్లను ప్రింట్ చేయడం ఆర్బీఐ బ్యాన్ చేసింది. అందుకే బ్యాంకు వాళ్లు ఆ నోట్లను ఇష్యూ చేయరు. కానీ.. తీసుకుంటారు. అది అసలు మ్యాటర్. అందుకే 2000 నోట్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు చేసే వాళ్లు కస్టమర్ల నుంచి 30 సెప్టెంబర్ 2023 వరకు 2000 నోట్లను తీసుకోవచ్చు. వాటిని ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. లేదా.. డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి కస్టమర్లు కూడా తమ దగ్గర 2000 నోటు ఉంటే అస్సలు టెన్షన్ పడకండి. వాటిని బ్యాంకుల్లో మార్చుకునే సదుపాయాన్ని కల్పించారు. చాలామందికి ఈ విషయాలు తెలియక 2000 నోటు అనగానే భయపడుతున్నారు. ఇంకా సమయం ఉంది కాబట్టి 2000 నోటు ఇప్పుడు మీ దగ్గర ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే సెప్టెంబర్ 30, 2023 తర్వాత మాత్రం ఆ నోట్లు మీ దగ్గర ఉంటే మాత్రం ఆ నోట్లు చెల్లవు.