BITSAT 2023 : ఐఐటీ, నిట్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థల తర్వాత అంతటి ప్రాధాన్యత, డిమాండ్ ఉన్న విద్యాసంస్థలు బిట్స్ పిలానీ. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు గత నెలతోనే ముగిసింది. ఏప్రిల్ 9నే అప్లికేషన్ల గడువు ముగిసింది. Bitsadmission.com వెబ్ సైట్ ద్వారా బిట్స్ పిలానీకి దరఖాస్తు చేసుకున్నారు. బిట్స్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అలాగే కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులకు పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్లలో చేరొచ్చు.
కాకపోతే బిట్స్ పిలానీ సంస్థ నిర్వహించే బిట్ సాట్ 2023 ఎంట్రేన్స్ పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. సంవత్సరానికి రెండు సార్లు ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది. 2023 విద్యా సంవత్సరానికి సెషన్ వన్ పరీక్షను మే 22 నుంచి 26 తేదీల్లో, జూన్ 18 నుంచి 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఒక విద్యార్థి సంవత్సరంలో రెండు సార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.
BITSAT 2023 : సెషన్ వన్ పూర్తయ్యాక రెండో సెషన్ కు అప్లయి చేసుకోవచ్చు
ఒకవేళ సెషన్ వన్ కి దరఖాస్తు చేసుకోలేని వాళ్లు.. బిట్స్ సంస్థ నిర్వహించే రెండో సెషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి సెషన్ పరీక్షలు ముగిశాక.. రెండో సెషన్ కు నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. అప్పుడు bitsadmission.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు సెషన్లలోనూ పరీక్షలు రాయాలనుకునే వాళ్లు రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాస్తే ఎందులో బెటర్ స్కోర్ వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
హైదరాబాద్, గోవా, పిలానీలలో ఉన్న బిట్స్ క్యాంపస్ లలో చదువే విద్యార్థులకు వందకు వంద శాతం క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు బిట్స్ క్యాంపస్ విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటాయి. అందుకే బిట్స్ క్యాంపస్ లో చదవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. అందుకు అనుగుణంగా బిట్స్ క్యాంపస్ లో సీటు కొట్టాలంటే ఐఐటీ స్టాండర్డ్ లో ఎంట్రెన్స్ కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.