Mobile Phone : చాలామంది మొబైల్ ఫోన్స్ అంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా ఐఫోన్ అంటే మాత్రం క్రేజ్ మామూలుగా ఉండదు. ఐఫోన్ లో ప్రతి సంవత్సరం కొత్త మోడల్స్ వస్తుంటాయి. కొత్త మోడల్ వచ్చిన ప్రతిసారి చాలామంది పాత మోడల్ ను పక్కన పడేసి కొత్త మోడల్ ఫోన్ కొంటుంటారు. అలాగే.. వేరే ఏ బ్రాండ్ నుంచి కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయినా కొందరు అయితే ఎంత డబ్బు అయినా పెట్టి కొనడానికి వెనుకాడరు. అసలు స్మార్ట్ ఫోన్లను నెలకు ఒకటి మార్చేవాళ్లు కూడా ఉన్నారు. మార్కెట్ లో కొత్త ఫోన్ రాగానే పాత ఫోన్లను పక్కన పెట్టేవాళ్లు ఉన్నారు. ఇలా.. ఫ్యాషన్ కోసం, స్టేటస్ కోసం ఫోన్లను కొనేవాళ్లు ఉన్నారు. కానీ.. అసలు కొత్త ఫోన్ కొనాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కొనాలి? ఏ ఫోన్ కొనాలి అనేదానిపై చాలామంది దృష్టి పెట్టరు.
డబ్బులు ఉన్నవాళ్లు ఎన్ని ఫోన్లు అయినా కొంటారు. వాళ్ల గురించి మనకు అనవసరం కానీ.. మధ్య తరగతి వాళ్లు, డబ్బులు ఎక్కువగా లేని వాళ్లు కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే ఎలా? వాళ్లు ఎప్పుడు కొంటే మంచిది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ కొనాలంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే.. అసలు మీకు కొత్త స్మార్ట్ ఫోన్ అవసరం ఏంటి అనేది ముందు చూసుకోవాలి. దానికి కారణం.. స్మార్ట్ ఫోన్ అనేది డిప్రీషియేషన్ కు సూచిక. దాన్ని కొనడం వల్ల రోజురోజుకూ దాని వాల్యూ తగ్గుతుంది కానీ.. పెరగదు. అటువంటి వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది అవసరమా లేక కావాలని కొనుక్కుంటున్నారా అనేది తెలుసుకోవాలి.
Mobile Phone : మరి కొత్త ఫోన్ ఎప్పుడు కొనుక్కోవాలి?
నిజానికి మనం ఒక వస్తువు కొన్నామంటే దాని అవసరం చాలా ఉండాలి. లేదా దాని నుంచి మనం అంతో ఇంతో డబ్బు సంపాదించగలిగేలా ఉండాలి. ఏదో టైమ్ పాస్ కి లక్షలు పెట్టి ఏ వస్తువు కొన్నా అది వృథానే తప్పితే ఇంకేం ఉండదు. అందుకే.. దాని వల్ల ఉపయోగం ఉంది.. దాని వల్ల నిజంగా ఏంతో కొంత యూజ్ ఉంది అనుకుంటే కొనుక్కోండి కానీ.. కొత్త ఫోన్ కొనడానికి సరైన సమయం ఫెస్టివల్స్.
అవును.. పండుగల సమయంలో కొత్త ఫోన్ కొంటె బెటర్. ఎందుకంటే.. ఆ సమయంలోనే కొత్త ఫోన్ల మీద చాలా ఆఫర్లు ఇస్తుంటారు. దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో ఈకామర్స్ కంపెనీలు పలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో మామూలు సమయంలో ఉన్న ధర కంటే 50, 60 శాతం వరకు తక్కువ ధరకే ఫోన్లను పొందే చాన్స్ ఉంటుంది.
అలాగే.. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. కొన్ని బ్రాండ్స్ కొత్త కొత్త మోడల్స్ ను విడుదల చేస్తుంటాయి. దాన్ని ఫస్ట్ సేల్ అంటారు. అప్పుడు బాగా ఆఫర్స్ ఉంటాయి. క్లియరెన్స్ సేల్ కూడా ఉంటుంది. ఎక్కువ స్టాక్ ఉంటే క్లియరెన్స్ సేల్ ద్వారా తక్కువ ధరకే ఫోన్లను అమ్ముతుంటారు. అలాంటి సమయాల్లో కొనుక్కుంటే బెస్ట్ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.