Watch : చాలామందికి రిస్ట్ వాచ్ పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి. ఫోన్లలో టైమ్ ఉంటుంది. వెనకట ఫోన్లు లేని కాలంలో అందరూ వాచ్ పెట్టుకునేవారు. వాచ్ పెట్టుకున్నవాళ్లకు వింతగా చూసేవారు. ఎందుకంటే.. అప్పట్లో డబ్బులు ఉన్నవారు మాత్రమే వాచ్ పెట్టుకునేవారు. చదువుకున్న వారు, గొప్పవాళ్లు, డబ్బులున్న వాళ్లే వాచ్ పెట్టుకునేవారు. ఒక ఊరిలో ఇద్దరుముగ్గురి దగ్గర మాత్రమే చేతికి వాచ్ కనిపించేది.
అయితే జనరేషన్లు మారాయి. ఇప్పుడు పెద్దగా వాచ్ ఎవ్వరూ పెట్టుకోవడం లేదు. స్మార్ట్ వాచ్ లు కూడా వచ్చేశాయ్. ఏది ఏమైనా.. వాచ్ లు అనేవి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇప్పటికీ కొందరు చేతికి వాచ్ పెట్టుకోనిదే బయటికి వెళ్లరు. అలా అలవాటు అయిపోయింది కొందరికి. ఇప్పుడు స్మార్ట్ వాచ్ లు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అది స్మార్ట్ వాచ్ అయినా.. మామూలు వాచ్ అయినా.. ఇంకే వాచ్ అయినా చాలామంది ఎడమ చేతికే పెట్టుకుంటారు. కానీ.. కొందరు మహిళలు మాత్రం వాచ్ ను కుడి చేతికి పెట్టుకుంటారు. వాళ్ల శాతం చాలా తక్కువ. కానీ.. ఎడమ చేతికి మాత్రం చాలామంది పెట్టుకుంటారు. దానికి కారణం ఏంటి.. అసలు ఎడమ చేతికే వాచ్ ఎందుకు పెట్టుకోవాలి.. తెలుసుకుందాం రండి.
Watch : కుడి చేతివాటం కలవారు కాబట్టే ఎడమ చేతికి పెట్టుకుంటారు
మీకు తెలుసు కదా. మనలో చాలామంది కుడి చేతి వాటం కలవారు. అంటే.. కుడి చేతితోనే అన్ని పనులు చేస్తారు. కుడి చేతితో తినడం, కుడి చేతితో రాయడం, కుడి చేతితోనే ఏపనైనా చేస్తుంటాం. ఒకవేళ కుడి చేతికి వాచ్ పెట్టుకుంటే.. ప్రతి సారి కుడి చేతిని పైకి లేపి వాచ్ లో టైమ్ చూసుకోవాల్సి వస్తుంది. దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చేతికి. అందుకే.. ఎడమ చేతికి వాచ్ పెట్టుకుంటే.. ఎడమ చేతితో చేసే పని చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎడమ చేతికి వాచ్ పెట్టుకుంటే అప్పుడు ఆ ఎడమ చేతితో చేసే పనులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎడమ చేతికి వాచ్ పెట్టుకునే వారు. అదే ఆచారం అప్పటి నుంచి ఇప్పటికీ వచ్చేసింది. అయితే.. ఈమధ్య మహిళలు కూడా ఎడమ చేతికే వాచ్ పెట్టుకుంటున్నారు.