Car Insurance Claim Rejected : చాలామంది కారు ఇన్సురెన్స్ తీసుకుంటారు కానీ.. ఆ ఇన్సురెన్స్ కు సంబంధించిన నిబంధనలను పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ ఇన్సురెన్స్ కంపెనీతో ఏ షోరూమ్స్ టైఅప్స్ అయ్యాయో కూడా తెలుసుకోరు. అదే వాళ్లు చేసే తప్పు. ఎందుకంటే.. కారు ఇన్సురెన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. అసలు కారుకు ఏదైనా ప్రమాదం జరిగితే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి నెట్ వర్క్ గ్యారేజీలు ఏమున్నాయో తెలుసుకోవాలి. మీ ప్రాంతంలో ఏ గ్యారేజీలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
లేకపోతే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. చాలామంది కారుకు యాక్సిడెంట్ అయితే.. ఏదైనా సమస్య వస్తే వెంటనే దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్లి బాగు చేయిస్తారు. ఎలాగూ కారు ఇన్సురెన్స్ ఉంది కదా అనే నమ్మకంతో దగ్గర్లోని గ్యారేజీకి తీసుకెళ్తుంటారు. కానీ.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాత్రం ఊహించలేరు. ఎందుకంటే.. అసలు తమ ఇన్సురెన్స్ ఆ గ్యారేజీలో నడుస్తుందా అని కూడా ఆలోచింరు. ఇన్సురెన్స్ వాళ్లే క్లెయిమ్ చేసుకుంటారు అనే నమ్మకంతో అలా చేస్తుంటారు.
Car Insurance Claim Rejected : కారు రిపేర్ చేయించడానికి ముందు ఇది చెక్ చేసుకోండి
కారు రిపేర్ చేయించుకోవడానికి ముందు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కారు రిపేర్ చేయించే గ్యారేజీ, కారు ఇన్సురెన్స్ కంపెనీతో టైఅప్ అయిందో లేదో ముందే తెలుసుకోండి. ఎందుకంటే అన్ని గ్యారేజీ కంపెనీలు.. కారు ఇన్సురెన్స్ కంపెనీలతో టైఅప్ అవ్వవు.
అటువంటప్పుడు మీకు కారు ఇన్సురెన్స్ ఉన్నా కూడా ఆ డబ్బు ముందు క్లెయిమ్ కాదు. రిపేర్ కు అయిన ఖర్చు మొత్తం ముందే పెట్టుకోవాల్సి ఉంటుంది. కారు రిపేర్ కు ఉదాహరణకు రూ.లక్ష అయితే ఆ లక్ష ముందే కట్టాల్సి ఉంటుంది. మీకు కారు ఇన్సురెన్స్ ఉన్నా కూడా ఆ గ్యారేజీతో టైఅప్ లేకపోతే ముందు బిల్లు పే చేసి ఆ తర్వాత ఆ బిల్లు రిసీప్ట్ తీసుకొని ఇన్సురెన్స్ కంపెనీలో రీఫండ్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత బిల్లును క్లెయిమ్ చేసుకున్నా కూడా ముందు రిపేర్ చేసిన డబ్బులను కట్టాల్సి ఉంటుంది. అందుకే.. మీ కారు ఇన్సురెన్స్ కంపెనీతో ఏ గ్యారేజీలు టై అప్ అయ్యాయో తెలుసుకొని ఆ గ్యారేజీలో మాత్రమే రిపేర్ చేసుకోండి. లేకపోతే అనవసరంగా ముందు డబ్బులు కట్టి తర్వాత క్లెయిమ్ కోసం ఇన్సురెన్స్ కంపెనీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకే.. ఖచ్చితంగా కారు ఇన్సురెన్స్ కంపెనీతో టై అప్ అయిన గ్యారేజీల గురించి ముందే తెలుసుకోవడం బెటర్.