Children Smart Phone : కరోనా వల్ల పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయ్యారు. ఇదివరకు పిల్లలు అంతగా స్మార్ట్ ఫోన్ వాడేవారు కాదు కానీ.. ఎప్పుడైతే లాక్ డౌన్ వల్ల క్లాసులు ఆన్ లైన్ లో చెప్పడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇక పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అలవాటు అవడం స్టార్ట్ అయింది. మాటలు రాని పిల్లలు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ను ఆపరేట్ చేస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తే వెంటనే స్మార్ట్ ఫోన్ చేతుల్లో పెడతాం. మెచ్యూర్డ్ వయసు వచ్చాక స్మార్ట్ ఫోన్ వాడితే తప్పు లేదు కానీ.. అసలు చిన్నపిల్లలు, మెదడు పరిణతి కూడా చెందని సమయంలో స్మార్ట్ ఫోన్ ను వాడటం అనేది అస్సలు కరెక్ట్ కాదు.
అసలే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లాంటివి వచ్చి పిల్లలను మరింత డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇవన్నీ 18 ఏళ్ల వయసు పైబడిన వాళ్లు వాడాలి కానీ.. 5 ఏళ్ల పిల్లలు కూడా సోషల్ మీడియా అకౌంట్లను మెయిన్ టెన్ చేస్తున్నారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిస కాకుండా ఉండాలంటే అది పూర్తిగా తల్లిదండ్రులదే బాధ్యత. పిల్లలకు ఫోన్లు ఇచ్చేది కూడా తల్లిదండ్రులే. వాళ్లు అల్లరి చేయగానే ఫోన్ చేతుల్లో పెడతారు. దీంతో వాళ్లు అల్లరి మానేసి ఫోన్ చూస్తూ కూర్చొంటారు. ఒక్కసారి ఫోన్ అలవాటు అయ్యాక ఎప్పుడూ ఫోన్ కావాలంటూ అల్లరి చేస్తుంటారు.
Children Smart Phone : తల్లిదండ్రులదే బాధ్యత
పిల్లలు ఏ పని చేసినా అది తల్లిదండ్రులదే బాధ్యత. అల్లరి చేయగానే వాళ్లకు ఫోన్ ఎక్కువగా ఇవ్వకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా గంటలకు గంటలు ఫోన్లలో గడిపితే పిల్లలు కూడా చూసి దానికే అలవాటు పడతారు. అందుకే తల్లిదండ్రులు కూడా అవసరం ఉంటేనే ఫోన్లలో మాట్లాడాలి.
భోజనం చేసే సమయంలో అస్సలు ఫోన్లు ఇవ్వొద్దు. పిల్లలతో సమయం స్పెండ్ చేయడం, వాళ్లను కాసేపు బయటికి తీసుకెళ్లడం, పార్కులకు తీసుకెళ్లడం లాంటివి చేయాలి. తోటి స్నేహితులతో వాళ్లను ఆడుకోనివ్వాలి. పిల్లలు ఎంత ఆడుకుంటే అంత మంచిది. వాళ్ల మెదడు ఎదుగుదల కూడా అంత బాగా ఉంటుంది. అందుకే.. వాళ్లకు ఫోన్ దూరం చేసి ఆటల్లో నిమగ్నం అయ్యేలా చేస్తే వాళ్లే కొన్ని రోజులకు ఫోన్ మరిచిపోతారు.