Computer Keyboard : మీరు ఎప్పుడైనా కంప్యూటర్ కీబోర్డును చూశారా? కంప్యూటర్ కీబోర్డ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అదేంటి.. కీబోర్డ్ లో ఉన్న ఆల్ఫాబెట్ లెటర్స్ ఆర్డర్ లో లేవేంటి అని మొదటి సారి కీబోర్డ్ చూసినప్పుడు మీకు అనిపించింది కదా. అయినా దానికి ఆన్సర్ మీకు ఇప్పటి వరకు దొరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కంప్యూటర్ కీబోర్డ్ పై అసలు లెటర్స్ ఎందుకు అలా ఉంటాయో చాలామందికి తెలియదు. మీకు ఇంకో విషయం తెలుసా? కంప్యూటర్ కీబోర్డ్ పై లెటర్స్ అలా ఉన్నా.. కొందరు అయితే టైపింగ్ చాలా స్పీడ్ గా చేస్తారు. అలా ఎలా సాధ్యం అవుతుంది. కీబోర్డ్ ను చూడకుండా అలా ఎలా కంప్యూటర్ మీద టైప్ చేయగలుగుతారు అనేది కూడా చాలామందికి తెలియదు. వీటన్నింటికి సమాధానమే ఈ కథనం.
ఈ కీబోర్డ్ ఇప్పుడు తయారు చేసింది కాదు. 1870 లో క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేసిన కీబోర్డ్ డిజైన్ నే ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరూ వాడుతున్నారు. దీన్నే క్వెర్టీ డిజైన్ అంటాం. క్వెర్టీ అంటే QWERTY అన్నమాట. కీబోర్డ్ లో స్టార్టింగ్ లెటర్స్ ఇవి. నిజానికి టైప్ రైటింగ్ మిషన్లు ఉంటాయి కదా. వాటిలో ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లోనే ఉండేవి. దీంతో టైపింగ్ సులువు అయిపోయేది. టకా టకా అక్షరాలను కొట్టేవారు. దాని వల్ల.. టైప్ రైటర్ లో ఉండే అక్షరాలు.. జామ్ అయిపోయయేవి.
Computer Keyboard : టైప్ రైటర్ జామ్ అవకుండా ఉండటం కోసమే ఈ కొత్త కీబోర్డ్
కంప్యూటర్లు లేనికాలంలో అందరూ టైప్ రైటర్లనే వాడేవారు. ప్రతి సారి టైప్ రైటర్ కీస్ జామ్ అవడం పెద్ద సమస్యగా మారింది. దానికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలని క్రిస్టోఫర్ అనుకున్నాడు. అందుకే.. త్వరగా టైప్ చేయడం నేర్చుకొని కీస్ జామ్ కాకుండా ఉండేలా.. కీబోర్డ్ ను డిజైన్ చేయాలనుకున్నాడు. అలా.. కొన్ని వందల రకాల డిజైన్లను క్రిస్టోఫర్ ట్రై చేశాడట. చివరకు క్వెర్టీ డిజైన్ చాలామందికి నచ్చిందట. దీంతో దాన్నే ఓకే చేసేశారు. ఈ డిజైన్ తో ముందు టైప్ చేయడం కష్టంగానే ఉంటుంది. అయితే.. కొంత ట్రెయినింగ్ తీసుకుంటే టైపింగ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు చాలామంది ఎంత ఫాస్ట్ గా టైపింగ్ చేస్తుంటారు. దానికి వాళ్లు తీసుకున్న శిక్షణే కారణం.