Test Cricket : క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారత్ లో క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే కాదు. అది ఒక క్రేజ్. క్రికెట్ ఆడేవాళ్లను దేవుళ్లుగా చూస్తారు జనాలు. క్రికెట్ అంటే చాలామందికి ఎంతో పిచ్చి. వ్యక్తిగత పనులు వదిలేసి మరీ క్రికెట్ ను చూస్తారు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది క్రికెట్ ఆడుతారు. చాలా దేశాల్లో ఆడినా.. భారత్ లో ఆడటం వేరు. భారత్ లో ఉండే క్రేజ్ వేరు.
అయితే.. మన ఇండియాలో పలు రకాల టోర్నమెంట్స్ జరుగుతుంటాయి. వన్ డే క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఆ తర్వాత ఇటీవల బాగా ఫేమస్ అయిన టీ20 క్రికెట్ కూడా అందరికీ తెలుసు. ఒక్కో క్రికెట్ టోర్నీకి ఒక్కో రకమైన జెర్సీని వాడుతారు భారత క్రికెటర్స్. టెస్ట్ క్రికెట్ ఆడేసమయంలో.. తెలుపు రంగు జెర్సీని ధరిస్తారు. కానీ.. ఎందుకు టెస్ట్ క్రికెట్ లో తెలుపు జెర్సీనే ధరిస్తారో చాలామందికి తెలియదు.
Test Cricket : 16వ శతాబ్దంలో పుట్టిన క్రికెట్
నిజానికి ఈ క్రీడ అనేది భారత్ కు చెందిన క్రీడ కాదు. ఇంగ్లండ్ కు చెందింది. 16వ శతాబ్దంలో పుట్టింది. కానీ.. ఇప్పుడు ప్రపంచమంతా క్రికెట్ ఆడుతోంది. ప్రపంచంలో ఉన్న అన్ని స్పోర్ట్స్ లో క్రికెట్ టాప్ లో ఉంటుంది. అయితే.. టెస్ట్ క్రికెట్ ఆడేసమయంలో తెలుపు రంగు జెర్సీని వేసుకునే ప్రక్రియను 18వ శతాబ్దంలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే తెలుపు రంగు జెర్సీని వాడుతున్నారు ప్లేయర్స్.
టెస్ట్ క్రికెట్ లో తెలుపు రంగునే వాడటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. టెస్ట్ క్రికెట్ అంటే రోజంతా ఉంటుంది. అంటే ఎండలోనూ ఆడాల్సి ఉంటుంది. ఎండలో ఆడినప్పుడు వేడిని తట్టుకునేలా ఉండేందుకు టెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ కి తెల్లని జెర్సీలను ఇచ్చేవారు. అవి సూర్యకాంతిని శోషించుకుంటాయి. దాని వల్ల.. ఆటగాళ్లకు ఎలాంటి వడదెబ్బ తగలదు.
మరో కారణం ఏంటంటే.. టెస్ట్ క్రికెట్ లో ఎక్కువగా రెడ్ కలర్ బంతిని వాడుతారు. రెడ్ కలర్ బంతిని వాడినప్పుడు బ్యాక్ డ్రాప్ తెల్లగా ఉండాలని.. అందరు ప్లేయర్స్ కి తెల్లని డ్రెస్సులు వేసుకోవాలని సూచిస్తారు. మరో కారణం ఏంటంటే.. ఈ క్రికెట్ ను కనిపెట్టిన బ్రిటీష్ వాళ్లు వైట్ కలర్ కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. తెల్లని దుస్తులు ధరించడం అంటే.. అందరూ ఈక్వల్ అని చెప్పే ప్రక్రియ. అందుకే.. తెలుపు రంగు జెర్సీని క్రికెటర్స్ ధరిస్తుంటారు. అదే ఆనవాయితీ బ్రిటీష్ కాలం నుంచి మనకు కూడా వచ్చేసింది.